Mr Bachchan Movie | ‘మిస్టర్ బచ్చన్’ రీమేక్ అన్న నెటిజన్.. సాలిడ్ కౌంటర్ ఇచ్చిన హరీశ్ శంకర్
Mr Bachchan Movie | మాస్ మహరాజా రవితేజ, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’(Mr Bachchan). మిరపకాయ్ సినిమా తర్వాత రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో ఈ సినిమా వస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రవితేజ ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్ అభిమానిగా కనిపించనున్నాడు.
Mr Bachchan Movie | మాస్ మహరాజా రవితేజ, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’(Mr Bachchan). మిరపకాయ్ సినిమా తర్వాత రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో ఈ సినిమా వస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రవితేజ ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్ అభిమానిగా కనిపించనున్నాడు. ఈ సినిమాను ఇండిపెండెన్స్ కానుకగా ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తాజాగా ప్రకటించింది. అయితే ఈ సినిమాపై ఓ నెటిజన్ ఇది రీమేక్ అంటూ కామెంట్ చేయగా.. సాలిడ్ రిప్లయ్ ఇచ్చాడు హరీశ్ శంకర్.
ఎక్స్ వేదికగా ఒక నెటిజన్ హరీశ్ శంకర్‌ను ట్యాగ్ చేస్తూ.. సర్ నాదోక రిక్వెస్ట్. ఇదే మీ లాస్ట్ రీమేక్ కావాలని ఆశిస్తున్నా. మీలో మంచి రైటర్ ఉన్నాడు. సొంత కథలతో మీరు మ్యాజిక్ చేయగలరు. ‘మిరపకాయ్’, ‘షాక్’లాంటి సినిమాలు ఇంకా నా మదిలో ఉన్నాయి. రవితేజ మిస్టర్ బచ్చన్‌కు ఆల్ ది బెస్ట్ సర్ అంటూ నెటిజన్ రాసుకోచ్చాడు. దీనికి హరీశ్ శంకర్ రిప్లయ్ ఇస్తూ.. ఈ సినిమా చూశాక నువ్వు రీమేక్ అని ఫీలైతే అప్పుడు మాట్లాడుకుందాం బ్రదర్. నేను సోషల్ మీడియా ఫ్రెండ్లీ డైరెక్టర్ని. మీరు నాతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు అని తెలిపాడు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ ఎక్స్‌లో వైరల్ అవుతుంది.
Idhi choosi nuvvu remake ani feel aithe appudu maatlaadukundhaam bro 😍 am the most social media friendly director… so u can communicate any time https://t.co/rRuIutwD0x
— Harish Shankar .S (@harish2you) July 21, 2024
మిస్టర్ బచ్చన్ సినిమా బాలీవుడ్ చిత్రం ‘రైడ్’ సినిమాకు రీమేక్ అని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్‌గా నిలిచింది. ఇప్పుడు ఇదే సినిమాను హరీశ్ శంకర్ రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను చిత్రబృందం ఖండించింది.
మరోవైపు ఈ సినిమాను ఇండిపెండెన్స్ కానుకగా ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ డేట్లో రామ్ పోతినేని – పూరి కాంబోలో వస్తున్న డబల్ ఇస్మార్ట్‌తో పాటు తమిళం నుంచి విక్రమ్ – పా. రంజిత్ కాంబోలో వస్తున్న తంగలాన్ విడుదల కానుంది. దీంతో మిస్టర్ బచ్చన్ కూడా ఆగష్టు 15న వస్తుండటంతో బిగ్ క్లాష్ అవ్వనుంది.
Also Read..
Cabinet Sub Committee | జీవో 317పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. సమాచారం ఇవ్వాలని మంత్రి ఆదేశం
WhatsApp: ఫోన్ నెంబర్ లేకుండానే వాట్సాప్ ఛాటింగ్.. రెఢీ అవుతున్న కొత్త ఫీచర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

