WhatsApp: ఫోన్ నెంబర్ లేకుండానే వాట్సాప్ ఛాటింగ్.. రెఢీ అవుతున్న కొత్త ఫీచర్
WhatsApp: ఫోన్ నెంబర్ లేకుండానే ఇక నుంచి వాట్సాప్ వాడుకునే సౌకర్యం అందుబాటులోకి రానున్నది. యూజర్‌నేమ్‌లు క్రియేట్ చేసి .. ఇతరులతో వాట్సాప్ చాటింగ్ చేసుకునే రీతిలో కొత్త ఫీచర్‌ను డెవలప్ చేస్తున్నారు.
హైదరాబాద్: ఫోన్ నెంబర్ లేకుండానే ఇక నుంచి వాట్సాప్(WhatsApp) వాడుకునే సౌకర్యం అందుబాటులోకి రానున్నది. యూజర్‌నేమ్‌లు క్రియేట్ చేసి .. ఇతరులతో వాట్సాప్ చాటింగ్ చేసుకునే రీతిలో కొత్త ఫీచర్‌ను డెవలప్ చేస్తున్నారు. వాబెటాఇన్ఫో దీనిపై ఓ రిపోర్టును ప్రచురించింది. ఈ కొత్త తరహా ఫీచర్ ఫ్లాట్‌ఫామ్‌కు చెందిన ఇంటర్ఫేస్ డిజైన్‌ను రూపొందిస్తున్నట్లు ఆ రిపోర్టులో పేర్కొన్నారు.
వాట్సాప్ యూజర్ల ప్రైవసీకి ప్రాముఖ్యతను ఇస్తూ ఈ కొత్త ఫీచర్‌ను డెవలప్ చేస్తున్నారు. యూజర్ ఫ్రొఫైల్ ద్వారా మనకు కావాల్సిన వారిని వాట్సాప్‌లో గుర్తించేందుకు ఈ కొత్త తరహా ప్రయత్నాన్ని చేపడుతున్నారు. కేవలం ఐడెంటిటీ తెలిసినవారు లేదా ఫోన్ నెంబర్ తెలిసినవారు మాత్రమే ఈ కొత్త తరహా ఫీచర్‌ను వాడుకునే ఛాన్సు ఉంటుంది.
ఫోన్ నెంబర్లు షేర్ చేయకుండానే.. యూజర్ నేమ్ ద్వారా కనెక్ట్ అయ్యే వాట్సాప్ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానున్నది. వాట్సాప్ వెబ్ పేజీ కోసం కూడా ఈ ఫీచర్‌ను తయారు చేస్తున్నారు. యూజర్ల ప్రైవసీ కోసం.. ఫోన్ నెంబర్ల బదులుగా కేవలం యూజర్ నేమ్‌ను వాడనున్నారు. మీ యూజర్‌నేమ్ తెలిసినవారు మీతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. ఫోన్ నెంబర్ షేర్ చేయడానికి ఇష్టపడనివారు.. యూజర్‌నేమ్ ద్వారా కనెక్ట్ అయ్యేందుకు ఇదో అదనపు ఫీచర్ కానున్నది.
ఈ పద్ధతి ద్వారా పర్సనల్ ఇన్ఫర్మేషన్కు ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అయితే ఎప్పుడు ఈ కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేస్తారా ఇప్పుడో ఇంకా క్లారిటీ లేదు. కొత్త వర్షన్స్‌లో దీన్ని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- phone number
- username
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

