Most Eligible Bachelor Trailer | టాలీవుడ్ ( Tollywood ) యువ నటుడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni), పూజా హెగ్డే ( Pooja Hegde ) నటిస్తోన్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ( Most Eligible Bachelor ). బొమ్మరిల్లు భాస్కర్ ( Bommarillu Bhaskar ) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ‘మన లైఫ్ పార్ట్నర్ తో కనీసం 9000 నైట్స్ కలిసి పడుకోవాలి. వందల వెకేషన్స్ కు వెళ్లాలి. అన్నింటికీ మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి. అలాంటి వాడెవడు అంటూ పూజా హెగ్డే సంభాషణలతో మొదలైంది ట్రైలర్. ఒక అబ్బాయి జీవితంలో 50 శాతం కెరీర్, 50 శాతం మ్యారేజ్ లైఫ్. మ్యారేజ్ లైఫ్ బాగుండాలంటే కెరీర్ బాగుండాలంటూ’ అఖిల్ చెప్తున్న డైలాగ్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ టైటిల్ కు సరిపడేలా సాగుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్, పోస్టర్లకు టాలీవుడ్ లో అద్బుతమైన స్పందన వస్తోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై వాసువర్మ, బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో మురళీ శర్మ, వెన్నెల కిశోర్, అజయ్, సుధీర్, సత్యకృష్ణన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అఖిల్ అక్కినేని హీరోగా ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అక్టోబర్ 15న థియేటర్లలో సందడి చేయనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Nabha Natesh | లెజెండరీ నటుడి గెటప్ లో ఇస్మార్ట్ భామ..స్పెషల్ ఏంటో..?
వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్
ఉత్తేజ్ భార్య సంతాప సభలో ఏడ్చేసిన మెగాస్టార్ చిరంజీవి
సమంత వదిన.. మీరు మా అన్నయ్యతోనే ఉండాలి.. చైసామ్ విడాకులపై శ్రీరెడ్డి స్పందన