Mookuthi Amman 2 | కోలీవుడ్ అగ్ర కథానాయిక నయనతార ప్రధాన పాత్రలో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ‘మూకుత్తి అమ్మన్’(Mookuthi Amman). ఈ సినిమాకు ఆర్జే బాలాజీ, ఎన్జే శరవణన్ సంయుక్తంగా దర్శకత్వం వహించగా.. ఈ చిత్రం 2020 లాక్డౌన్ టైంలో నేరుగా ఓటీటీలోకి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కామెడీ అండ్ డివోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాలో నయనతార అమ్మవారి పాత్రలో కనిపించి ప్రేక్షకులకు అలరించింది.
అయితే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ‘మూకుత్తి అమ్మన్ 2’ (Mookuthi Amman 2). త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, రౌడీ పిక్చర్స్ బ్యానర్లపై డా.ఈశారి కె గణేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఆర్జే బాలాజీ, ఎన్జే శరవణన్ దర్శకత్వం వహిస్తారా లేదా కొత్త దర్శకుడిని తీసుకుంటారా అనేది మూవీ టీం ప్రకటించాల్సి ఉంది. అజ్మల్ ఖాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.
Also Read..