AP News | కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ నీచుడు ఆరు నెలల చిన్నారిపై పైశాచికత్వం చూపించాడు. ఊయలలో పడుకున్న చిన్నారిని అత్యాచారం చేశాడు. విజయనగరం జిల్లాలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలానికి చెందిన ఓ మహిళకు ఇద్దరు కూతుళ్లు. ఆరు నెలల వయసున్న తన చిన్న కూతుర్ని ఊయలలో పడుకోబెట్టి.. ఆమె దగ్గరలోని కిరాణ దుకాణానికి వెళ్లింది. ఇది గమనించిన నార్లవలస గ్రామానికి చెందిన బోయిన ఎరకన్న దొర ఇంట్లోకి వెళ్లి ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడు. దీంతో ఆ పాప గట్టిగా ఏడ్చింది. ఇది విన్న చిన్నారి వాళ్ల అక్క అక్కడకు వెళ్లి ఆ దారుణాన్ని చూసింది.
వెంటనే కిరాణానికి వెళ్లిన తల్లి దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పింది. దీంతో తల్లితో పాటు స్థానికులు అందరూ ఆగ్రహంతో వెళ్లారు. అది గమనినంచిన ఎరకన్న దొర అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం రక్తస్రావమైన చిన్నారిని బాడంగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయనగరంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం చిన్నారి క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు స్వయంగా గ్రామానికి వెళ్లి స్థానికుల నుంచి వివరాలను సేకరించారు. అనంతరం నార్లవలసకు వెళ్లి నిందితుడిని అరెస్టు చేశారు.