Purushothamudu | రాజ్ తరుణ్. ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. సినీ నటుడు రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకోని మోసం చేశాడంటూ అతని ప్రేయసి లావణ్య (lavanya) పోలీసులకు కంప్లయింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై 420, 506, 493 సెక్షన్ల కింద రాజ్ తరుణ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.
అయితే ఈ కేసుపై విచారణ జరుగుతున్న క్రమంలో రాజ్‌తరుణ్ (Raj Tarun) లేని లైఫ్‌లో తాను ఉండలేనని, బతకలేనని ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తన అడ్వకేట్‌కు లావణ్య మెసేజ్ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి తన లాయర్‌కు సందేశం పంపించడంతో అప్రమత్తమైన అతడు.. వెంటనే డయల్ 112 ద్వారా నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఒక వైపు లావణ్య వివాదం నడుస్తుంటే.. మరోవైపు తన సినిమాలను చక చక పూర్తి చేస్తున్నాడు రాజ్ తరుణ్. తాజాగా రాజ్‌తరుణ్ తన కొత్త సినిమా విడుదల తేదీని ప్రకటించాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘పురుషోత్తముడు’ (Purushothamudu). హాసినీ సుధీర్ కథానాయికగా నటిస్తుండగా.. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తుంది. భీమన దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాను జూలై 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Get ready for a heartwarming & fun-filled experience as #Purushothamudu hits the big screens on July 26th to entertain you & your family! 🎉🍿
ICYM the first single #PachaPachani 🌟
▶️ https://t.co/RttmEUQj96@itsRajTarun @meramyakrishnan @iTsviran21 @prakashraaj… pic.twitter.com/pPTXsgOoOm— Junglee Music South (@JungleeMusicSTH) July 14, 2024
Also Read..