Bharateeyudu 2 | రన్‌టైం విషయంలో ‘భారతీయుడు 2’ టీమ్ కీలక నిర్ణయం!
Bharateeyudu 2 | కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో లోక నాయకుడు కమల్‌హాసన్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'భారతీయుడు 2. లైకా ప్రోడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మూవీ ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి.
Bharateeyudu 2 | కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో లోక నాయకుడు కమల్‌హాసన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2. లైకా ప్రోడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మూవీ ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. మరోవైపు తమిళనాడు కంటే తెలంగాణలో టికెట్ రేట్ ఎక్కువ ఉండడం ఈ సినిమాకు మరింత మైనస్ అయ్యింది. దీంతో ఈ సినిమా విషయంలో చిత్రయూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ సినిమా మూడు గంటల రన్‌టైం ఉండగా.. అంతసేపు ప్రేక్షకులు చూడలేకపోతున్నారని అందుకే మువీ నుంచి 20 నిమిషాలు ట్రిమ్ చేసినట్లు సమాచారం. అలా ట్రిమ్ చేసిన కట్‌తోనే ప్రస్తుతం తెలుగులో షోలు నడుస్తున్నట్లుగా తెలిసింది. ఇక ట్రిమ్ చేసిన అనంతరం మూవీపై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. కమల్‌హాసన్, సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రియా భవానీ శంకర్, నెడుముడి వేణు, బాబీ సింహ, సముద్రఖని, వివేక్, కాళిదాస్ జయరాం తదితరులు నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. చిత్ర అరవిందన్ (సిద్ధార్థ్)కు సామాజిక స్పృహ ఎక్కువ. సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ సమాజంలో జరుగుతున్న అవినీతి ఘటనలను ప్రజలకు తెలియజేస్తూ వారిని చైతన్యపరుస్తుంటాడు. ఉద్యోగం కోసం ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన అతన్ని కలవరపరుస్తుంది. అందుకు కారకులైన వారిని శిక్షించాలంటూ అరవిందన్ చేసే పోరాటం ఫలించదు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన అతను ‘భారతీయుడు’ మళ్లీ రావాలంటూ సోషల్‌మీడియా ద్వారా విస్త్రతంగా ప్రచారం చేస్తాడు. ఈ నేపథ్యంలో తైవాన్ రాజధాని తైపీలో ఉంటున్న భారతీయుడు (సేవాపతి) ఇండియాకు తిరిగొస్తాడు. భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్న కొందరు బడా బాబులను అంతమొందిస్తాడు. అదే క్రమంలో అవినీతికి వ్యతిరేకంగా యువతలో చైతన్యం నింపుతూ రహస్యంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తుంటాడు. ఈ నేపథ్యంలో యాంటీ కరప్షన్ బ్యూరోలో పనిచేస్తున్న అరవిందన్ తండ్రి (సముద్రఖని) సైతం అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అవుతాడు. దీంతో మనస్తాపానికి గురైన అతని భార్య ఆత్మహత్య చేసుకుంటుంది. తన కుటుంబంలో ఇంతటి విషాదానికి కారణం సేనాపతియేనని అరవిందన్ అతనిపై కోపం పెంచుకుంటాడు. ఇండియన్ గోబ్యాక్ అంటూ ప్రచారాన్ని ప్రారంభిస్తాడు? ఈ క్రమంలో ఏం జరిగింది? అవినీతిని అంతమొందిస్తానని తిరిగొచ్చిన సేనాపతిపై సామాన్య ప్రజలు కూడా తిరగబడటానికి కారణాలేమిటి? భారతీయుడి అసలు లక్ష్యం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానంగా మిగతా చిత్ర కథ నడుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

