Mohanlal | మలయాళ సినీ దిగ్గజ నటుడు మోహన్‌లాల్ (Mohanlal) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి (Santhakumari) కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 90 ఏండ్లు. కొచ్చి (Kochi)లోని ఎలమక్కర (Elamakkara)లో ఉన్న మోహన్‌లాల్ నివాసంలో ఆమె ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శాంతకుమారి.. ఇవాళ ఉదయం అస్వస్థతతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, మోహన్‌లాల్ అభిమానులు శాంతకుమారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
Also Read..
Nivin Pauly | దశాబ్ద కాలం నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు హిట్టు కొట్టిన ‘ప్రేమమ్’ హీరో నివిన్ పాలీ!
Beauty | ఇక ఓటీటీలోకి అంకిత్ కొయ్య బ్యూటీ.. ఇంతకీ ఏ ప్లాట్ఫాంలోనంటే..?