Beauty | అంకిత్ కొయ్య, నీలఖి కాంబోలో తెరకెక్కిన ప్రాజెక్ట్ బ్యూటీ (Beauty). జేఎస్ఎస్ వర్ధన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి జేఎస్ఎస్ వర్ధన్ డైలాగ్స్ కూడా అందించాడు. హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్.. తండ్రీ కూతుళ్ల రిలేషన్.. ప్రేమకథలో మలుపులు వంటి అంశాల చుట్టూ తిరిగే ఈ సినిమాలో అందరికీ ఉంటారు కూతుళ్లు.. కానీ ఇలా నెత్తిమీద పెట్టుకుని చూసేవాళ్లు మాత్రం మీరే ఉంటారంటూ సాగే డైలాగ్స్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
కాగా ఈ మూవీని థియేటర్లలో మిస్సయిన వారి కోసం ఓటీటీ రిలీజ్ అప్డేట్ వచ్చేసింది. బ్యూటీ పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో సందడి చేయనుంది. బ్యూటీ జనవరి 2న జీ5లొ ప్రీమియర్ కాన్నునట్టు ప్రకటించారు. అయితే బ్యూటీ డబ్బింగ్ వెర్షన్లపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకేంటి మరి బ్యూటీపై మీరూ ఓ లుక్కేయండి.
ఈ మూవీకి విజయ్ బల్గానిన్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ నరేశ్ కీ రోల్లో నటించగా.. వాసుకి ఆనంద్, ప్రసాద్ బెహరా, నితిన్ ప్రసన్న, మురళీగౌడ్ ఇతక కీలక పాత్రలు పోషించారు. మారుతి టీం సమర్పణలో వచ్చిన ఈ చిత్రాన్ని వానర సెల్యులాయిడ్, జీ స్టూడియోస్ బ్యానర్లపై అడిదాల విజయ్‌పాల్ రెడ్డి, ఉమేశ్ కుమార్ బన్సాల్ సంయుక్తంగా నిర్మించారు.
‘కూతురు అడిగింది కొనిచ్చేటప్పుడు వచ్చే కిక్కు ఓ మధ్య తరగతి తండ్రికే తెలుస్తుంది.. తన కోసం కొంచెం కష్టపడాలి.. పడతాను..’అంటూ తండ్రి తన కూతురు కోసం చెబుతున్న ఎమోషనల్ డైలాగ్స్ అందరినీ ఇంప్రెస్ చేస్తాయి.
#Beauty (Telugu) streaming from January 2 on Zee5 🍿!!#OTT_Trackers pic.twitter.com/syxkRctQhZ
— OTT Trackers (@OTT_Trackers) December 30, 2025