Kannappa | టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు (Manchu Vishnu) టైటిల్ రోల్ పోషిస్తున్న ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa). ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన టీజర్‌తోపాటు కీ రోల్స్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రంలో మాలీవుడ్ స్టార్ యాక్టర్ మోహన్ లాల్ కిరాట పాత్రలో నటిస్తున్నాడు. ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మోహన్ లాల్‌కు మేకర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ వీడియో విడుదల చేశారు. మోహన్ లాల్ కిరాట అవతారంలో విల్లు చేతబట్టి తన సైన్యంతో కొండల్లో నుంచి నడుచుకుంటూ వస్తోన్న విజువల్స్ సినిమాపై క్యూరియాసిటీ అమాంతం పెంచేస్తున్నాయి. కిరాట పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్.
కన్నప్ప చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ మూవీని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, Ava Entertainment బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. కన్నప్ప మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రభాస్, నయనతార, మధుబాల, శరత్‌కుమార్, శివరాజ్‌కుమార్, ఐశ్వర్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మోహన్ లాల్ బర్త్ డే స్పెషల్ ఎంట్రీ ..
Raashi Khanna | సినిమాలంటే ఆసక్తి లేదట.. తన రూంమేట్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన రాశీఖన్నా
Ruchi Gujjar | మోదీ నెక్లెస్‌తో కేన్స్‌లో సందడి చేసిన బాలీవుడ్ భామ.. అందరి చూపు ఆమె వైపే
Thug life | ముంబైలో కమల్‌హాసన్, శింబు థగ్‌లైఫ్ టీం.. ట్రెండింగ్‌లో స్టిల్స్