BARROZ | మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ (Mohanlal) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఈ స్టార్ యాక్టర్ స్వీయదర్శకత్వంలో నటించిన మలయాళ ఫాంటసీ సినిమా బరోజ్ (BARROZ). క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై.. మిక్స్డ్ రెస్పాన్స్ రాబట్టుకుంది. ఇక ఈ చిత్రం ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది.
బరోజ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రీమియర్ కానుంది. బరోజ్ జనవరి 22 నుంచి మలయాళం, తెలుగు, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుందని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రకటించింది. అయితే ట్విస్ట్‌తో బరోజ్ ప్రీమియర్ కానుంది. హిందీ వెర్షన్‌ను మాత్రం తర్వాత విడుదల చేయనున్నట్టు తెలిపింది. బరోజ్ థియేటర్లలో త్రీడీ వెర్షన్లో విడుదల కాగా.. ఓటీటీలో 2డీ వెర్షన్ అందుబాటులో ఉండనుంది.
బరోజ్: గార్డియన్ ఆఫ్ డిగామాస్ ట్రెజర్ (Barroz: Guardian of D’Gama’s Treasure) నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి జిజో పున్నూస్ కథ, స్క్రీన్ ప్లే సమకూర్చాడు. ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరంబవూరు తెరకెక్కించారు.
ఆ డిగామా బంగ్లాలోపల ఎవరికీ కనిపించని భూతం ఉందంటూ ఓ చిన్నారి వాయిస్ ఓవర్‌తో మొదలైన ట్రైలర్లో వందల సంవత్సరాలుగా నిధులు కాపాడుకుంటూ వస్తోన్న భూతం. మిగితా వారి కోసం కార్చే కన్నీరు కంటే మహత్తరమైన నిధి ఈ లోకంలో మరేది లేదంటూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాడు మోహన్ లాల్. మరి బరోజ్కు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
#Barroz3D Streaming in #DisneyPlusHotstar from January 22 👏👏👏 Who all are waiting to Experience #Mohanlal‘s Directorial Debut 👌👌👌 Waiting for #Barroz Papa 🔥🔥 pic.twitter.com/cepj4KqfBW
— Kerala Box Office (@KeralaBxOffce) January 20, 2025
బరోజ్ ట్రైలర్..
Kichcha Sudeepa | హోస్ట్‌గా 11 సీజన్లు.. బిగ్ బాస్ షోకి గుడ్ బై చెప్పిన కన్నడ స్టార్ హీరో
Shatrughan Sinha | ఏఐతో సైఫ్ అలీఖాన్‌పై పోస్ట్.. విమర్శలు ఎదుర్కొంటున్న ఎంపీ శత్రుఘ్న సిన్హా
Thalapathy 70 | దళపతి 70కు ప్లాన్.. విజయ్ ఏంటీ పవన్ కల్యాణ్ రూటులోనే వెళ్తున్నాడా..?