Vrusshabha | మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘వృషభ’. నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్. వ్యాస్ స్టూడియోస్, ఆశీర్వాద్ సినిమాస్ సమర్పిస్తు్ండగా.. శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సి.కె. పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్. వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
పాన్ ఇండియాగా బ్యాక్ డ్రాప్లో రాబోతున్న ఈ చిత్రం విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనుంది. మోహన్ లాల్ ఓ వైపు సింహాసనంపై స్టైలిష్‌గా సూట్లో కనిపిస్తూనే.. మరోవైపు బ్యాక్ డ్రాప్లో యోధుడి గెటప్‌లో కనిపిస్తున్నాడు.
మోహన్‌లాల్ ఇందులో కథానుగుణంగా యోధుడి పాత్రతోపాటు మరో రోల్లో కూడా కనిపించబోతున్నట్టు తాజా లుక్ చెప్పకనే చెబుతోంది. మోహన్ లాల్ ఇందులో యాక్షన్ ప్యాక్డ్ రోడ్లో కనిపించనున్నట్టు ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ హింట్ ఇచ్చేశాయి.
#GeethaFilmDistribution brings the Complete Actor @mohanlal‘s Epic Saga #Vrusshabha to Telugu audience 💥
Gear Up for a Spectacular Experience in Cinemas ❤️🔥
The ROAR Begins in Theatres on Dec 25th..#VrusshabhaTelugu #VrusshabhaOn25thDecember#SamarjitLankesh @ursnayan… pic.twitter.com/ReX9FgYh6v
— BA Raju’s Team (@baraju_SuperHit) December 16, 2025
45 Official Trailer | శివన్న – ఉపేంద్రల మెగా మల్టీస్టారర్.. ’45’ ట్రైలర్ విడుదల