సైబర్ ముప్పు నుంచి మహిళలకు రక్షణ కల్పించాలి
సైబర్ ముప్పు నుంచి మహిళలకు రక్షణ కల్పించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
- పార్లమెంటరీ స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేయాలి
- ‘ఎక్స్’ ద్వారా రాష్ట్రపతి, ప్రధానికి ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి
- సినీనటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోపై ఆందోళన
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): సైబర్ ముప్పు నుంచి మహిళలకు రక్షణ కల్పించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోను కొందరు సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేస్తూ.. సైబర్ ముప్పు నుంచి మహిళలను రక్షించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని పేర్కొన్నారు.
మహిళల రక్షణ కోసం చేపట్టాల్సిన సమగ్ర చర్యలపై పార్లమెంటరీ స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఎక్స్ (ట్విటర్) ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ట్యాగ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత పెట్టిన పోస్టుకు 264.1కే వ్యూస్ వచ్చాయి. మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలను రూపొందించాల్సిన ఆవశ్యకతపై ఎందరో నెటిజన్లు చర్చించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పాతికేండ్లయినా ప్రమోషన్ నిల్.. అత్యంత దయనీయ స్థితిలో ఎస్జీటీలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

