Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా బడ్జెట్ అక్షరాలా 700కోట్లట. ఆ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఓ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ‘నాకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కోసం ప్రత్యేకంగా నెలరోజుల క్రితం ట్రయల్ షూట్ నిర్వహించారు. అనుకోకుండా ఆ షూట్లో నా చేయి ఫ్రాక్చర్ అయ్యింది. దాంతో నెలరోజులు రెస్ట్ తీసుకున్నా. ఈ నెల చివరి నుంచి డేట్స్ ఇచ్చా. నాకోసం ప్రభాస్ తన డేట్స్ మార్చుకుని, ఈ నెల చివరి నుంచి నాతోపాటు ఆయన కూడా షూటింగ్లో పాల్గొనబోతున్నారు.
అంత పెద్ద స్టార్ అలా చేయడం నాకెందుకో హార్ట్ టచింగ్‌గా అనిపించింది. ‘ఫౌజీ’ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న సినిమా. ఈ ప్రాజెక్ట్‌కి దాదాపు రూ.700 కోట్లు ఖర్చు చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు’ అని తెలిపారు మిథున్ చక్రవర్తి. ఇదిలావుంటే.. కొన్ని రోజుల క్రితం షూటింగులన్నింటికీ బ్రేక్ ఇచ్చేసి వెకేషన్ అంటూ ఇటలీ వెళ్లారు ప్రభాస్. మూడ్నాలుగు రోజుల్లో మళ్లీ ఆయన తిరిగి ఇండియా చేరుకోనున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజాసాబ్, ఫౌజీ సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ప్రభాస్ ఇండియా రాగానే వీటి షూటింగులపై క్లారిటీ రానుంది. మిథున్ మాటలను బట్టి ఆయన ముందు ‘ఫౌజీ’ సెట్లోకి ఎంటరవుతారని అర్థమవుతోంది.