JETLEE | మత్తు వదలరా, మత్తు వదలరా 2 చిత్రాలతో డైరెక్టర్‌గా మంచి ఫేం సంపాదించాడు రితేష్ రానా. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ స్టార్ కమెడియన్ సత్య లీడ్ రోల్లో కొత్త సినిమాను ప్రకటించాడని తెలిసిందే. సత్య హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ సమర్పిస్తుంది.
ఈ మూవీ జెట్లీ (JETLEE) టైటిల్‌తో రాబోతుంది. సత్య విమానం పైన ఎక్కి కామెడీ సినిమాలతో నేను విసిగిపోయానంటూ హీరో అవ్వబోతున్నానంటూ ఫన్నీగా ఫోజులిచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో సత్యకు జోడీగా మిస్ యూనివర్స్ ఇండియా రియా సింగా హీరోయిన్గా నటిస్తోంది. మేకర్స్ రియా సింగాకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
రియా గన్ పట్టుకొని ఎయిర్‌క్రాప్ట్‌లో ఉండగా.. ఫైరింగ్ దృశ్యాలను చూడొచ్చు. రియా సింగా ఓ వైపు అందాలు ఆరబోస్తూండా… మరోవైపు చుట్టూ దూసుకొస్తున్న మిరుమిట్లను గమనించవచ్చు. ఈ మూవీలో వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తుండగా..చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
Miss Universe India in a Universal Telugu cinema 👸❤️🔥
Introducing #RheaSingha, landing from the world of #JETLEE ✈️
Wishing the Amazing and Gorgeous Rhea a very Happy Birthday 🥳
A @RiteshRana‘s turbulence 🛫
Starring #Satya, #RheaSingha, @vennelakishore
Produced by… pic.twitter.com/SOHvEH0aPJ— Ramesh Bala (@rameshlaus) December 10, 2025
Karthi | హిట్ 4 ఎప్పుడు.. కార్తీ ప్రశ్నకు డైరెక్టర్ శైలేష్ కొలను ఏం చెప్పాడంటే..?
Bigg Boss 9 | బిగ్ బాస్ సీజన్9లో ఊహించని ట్విస్ట్.. మిడ్ వీక్‌లో ఒక ఎలిమినేషన్ ?
Akhanda 2 | అఖండ 2 దెబ్బకి ఇన్ని సినిమాలు వాయిదా పడ్డాయా.. ఏకంగా రజనీకాంత్ చిత్రం కూడా..!