Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈసారి పాజిటివ్ ట్రాక్‌లో నడుస్తూ మంచి సక్సెస్ అందుకుంది. గత రెండు మూడు సీజన్లు ఊహించినంత బజ్ రాకపోయినప్పటికీ, ఈ సీజన్ మాత్రం మొదటి వారం నుంచి చివరి వారం వరకు మంచి వ్యూయర్షిప్తో టీఆర్పీల పరంగా కూడా అద్భుతమైన ఫలితాలు సాధించింది. ప్రస్తుతం షో చివరి వారంలోకి చేరడంతో ఉత్కంఠ మరింతగా పెరిగిపోయింది. హౌస్‌లో మిగిలిన ఏడు మంది కంటెస్టెంట్లలో ఇద్దరు బయటకు వెళ్లినప్పుడే టాప్ 5 ఫైనల్ లిస్ట్ ఖరారు కానుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కోసం మిడ్ వీక్ ఎలిమినేషన్‌ను ప్లాన్ చేసినట్టుగా సమాచారం. ఈ వారం నామినేషన్లలో పవన్ కళ్యాణ్ మినహా మిగతా ఆరు మంది నామినేషన్స్‌లో ఉన్నారు.
విన్నర్ రేస్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ముందున్నాడు. అతడిని ఓడించేది తనూజ, ఇమ్మాన్యుయేల్లో ఒకరు అనే చర్చ నడుస్తుంది. ఆడియన్స్ బేస్ చూస్తే పవన్ కళ్యాణ్‌కే ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టు ఇండస్ట్రీ టాక్. ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎప్పుడు? ఎలా? ఉంటుంది అనేది చూస్తే సాధారణంగా బిగ్ బాస్ ఇలాంటి ఎపిసోడ్లను మిడ్ నైట్‌లో ప్లాన్ చేస్తాడు. కంటెస్టెంట్లు నిద్రలో ఉండగా వారిని లేపి షాక్ ఇచ్చే డ్రామాటిక్ మూమెంట్స్ షోని ఆసక్తికరంగా మారుస్తున్నారు. అయితే ఈసారి ఆ షాక్ ఎవరికోసం అన్నదానిపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం బయటకు వెళ్లే వారిలో ఇద్దరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి . వారు సుమన్ శెట్టి , సంజన. ఆడియన్స్ ఓటింగ్ పరంగా చూస్తే సుమన్ శెట్టి బయటకు వెళ్లే అవకాశం ఎక్కువ. సంజనకు ఓట్లు బాగానే వస్తున్నాయి. అయితే ఇమ్మ్యూనిటీ టాస్క్‌లలో ఆమె తేలిపోయినట్టు సమాచారం.
ఒకవేళ ఎలిమినేషన్‌ను టాస్క్ ప్రదర్శన ఆధారంగా చేస్తే సంజన గురువారం బయటకు వెళ్లే అవకాశం బలంగా కనిపిస్తోంది. అదే ఓటింగ్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఇమ్మ్యూనిటీ టాస్కుల విషయానికి వస్తే పవన్, ఇమ్మాన్యుయేల్ మంచి స్కోర్‌తో ముందున్నారు. ఆడియన్స్ ఓటు అప్పీల్ చాన్స్ మాత్రం ఇమ్మాన్యుయేల్‌కు దక్కింది. తాజా ఎపిసోడ్లలో భరణీ, తనూజ అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. బాల్స్ టాస్క్‌లో తనూజ ఫస్ట్, భరణీ సెకండ్ స్థానాల్లో నిలిచారు. అనంతరం జరిగిన పజిల్ టాస్క్‌లో భరణీ టాప్ 1, తనూజ టాప్ 2గా నిలిచినట్టు తెలుస్తోంది. ఎక్కువ ఓట్లు వచ్చిన తనూజకు ఓటు అప్పీల్ చేసే అవకాశం దక్కింది. మొత్తం మీద బిగ్ బాస్ 9 చివరి వారం ఉత్కంఠభరితంగా, ట్విస్ట్‌లతో సాగుతోంది. రాబోయే 48 గంటల్లోనే ఫైనల్ టాప్ 5 ఎవరనేది తెలిసిపోతుంది.