Karthi | తమిళంతోపాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న కోలీవుడ్ స్టార్ యాక్టర్ కార్తీ (Karthi) యాక్టర్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం వా వాతియార్ (Vaa Vaathiyaar). నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఉప్పెన ఫేం కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా.. సత్యరాజ్, రాజ్‌కిరణ్, జీఎం సుందర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రమోషనల్ ఈవెంట్లో కార్తీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈవెంట్‌కు వచ్చిన హిట్ ప్రాంచైజీ డైరెక్టర్ శైలేష్ కొలనును హిట్ 4 ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందని అడిగాడు కార్తీ. దీనికి శైలేష్ కొలను (నవ్వుతూ) స్పందిస్తూ.. నేను ఇంకా స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నా. కథ పూర్తి చేసేందుకు మరికొంత సమయం కావాలన్నాడు. శైలేష్ కొలను తాజా కామెంట్స్‌తో హిట్ ప్రాంచైజీలో రాబోయే నాలుగో ఇన్స్టాల్మెంట్పై మూవీ లవర్స్‌తోపాటు అభిమానుల్లో క్యూరియాసిటీ మరింత పెరిగిపోతుంది.
హిట్ 3లో నాని లీడ్ రోల్లో నటించడంతోపాటు నిర్మాతగా కూడా వ్యవహరించాడని తెలిసిందే. ఇందులో కార్తీ కామియో అప్పీయరెన్స్‌లో కనిపించాడు. మరి హిట్ డైరెక్టర్ శైలేష్ కొలనును ఓపెన్‌గా అడిగే సరికి నాలుగో పార్ట్‌లో లీడ్ రోల్ చేసేది కార్తీనే అయి ఉంటుందని అంతా తెగ చర్చించుకుంటున్నారు.