Mirzapur 3 | ఇండియన్ మోస్ట్ పాపులర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘మీర్జాపూర్ 3’ (Mirzapur 3) ఓటీటీలో దూసుకుపోతుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ అరుదైన రికార్డును నమోదు చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన దీని రెండు భాగాలు రికార్డు స్థాయి వ్యూస్‌తో భారీ ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్నాయి. దీంతో మూడో సీజన్ ‘మీర్జాపూర్ 3’ (Mirzapur 3) కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే తాజాగా ఈ సిరీస్ సీజన్ జూలై 05 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది.
ఈ సిరీస్ వచ్చి వారం కాకుండానే అరుదైన రికార్డును అందుకుంది. ప్రైమ్ వీడియోలో రిలీజైన ఈ చిత్రం వీకెండ్ అత్యధిక వ్యూస్ దక్కించుకున్న సిరీస్‌గా నిలిచింది. అంతేకాదు గతంలో వచ్చిన మీర్జాపూర్ 2 రికార్డును కూడా బ్రేక్ చేసింది. 85 దేశాల్లో టాప్ 10 లిస్ట్‌లో నిలిచింది. ఈ విషయాన్ని ప్రైమ్ ఎక్స్ వేదికగా ప్రకటించింది.
ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. సీజన్ 2 ముగింపులో మున్నా(దివ్యేందు శర్మ) గుడ్డు (అలీ ఫజల్) చేతిలో చనిపోయిన అనంతరం మీర్జాపూర్ సింహాసనం గుడ్డు వశం అవుతుంది. అయితే ఇంతకుముందు ఖాలీన్ (పంకజ్ త్రిపాఠి) చేతిలో ఉన్న మీర్జాపూర్‌ను గుడ్డు ఎలా శాసిస్తాడు. మరోవైపు గుడ్డుని చంపి మీర్జాపూర్‌ను దక్కించుకోవాలని అక్కడి లోకల్ గ్యాంగ్స్ చూస్తుంటాయి. ఈ క్రమంలోనే గుడ్డు ఏం చేశాడు అనేది సీజన్ 3 స్టోరీ. ఈ సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేత త్రిపాఠి, మాధురీ యాదవ్, విజయ్ వర్మ తదితరులు నటించిన ఈ వెబ్ సిరీస్‌కు గుర్మీత్‌సింగ్, ఆనంద్ అయ్యర్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక త్వరలోనే సీజన్ 4 కూడా అనౌన్స్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.
Record break karna toh apna USP hai! 🔥🔥
Mirzapur S3 is officially the most-watched show ever on Prime Video in India on the launch weekend.#MirzapurOnPrime, watch now pic.twitter.com/JB5EOezq8B
— prime video IN (@PrimeVideoIN) July 12, 2024
Also Read..