Harom Hara | టాలీవుడ్ నటుడు సుధీర్‌బాబు (Sudheer Babu) ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘హరోంహర’(Harom Hara). ‘ది రివోల్ట్’ అనేది ఉపశీర్షిక. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించగా.. మాళవికా శర్మ కథానాయికగా నటించింది. సుమంత్ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా సుధీర్‌బాబుకు మంచి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇదిలావుంటే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అనుకోని కారణాల వలన ఓటీటీ తేదీ వాయిదా పడింది.
మొదట ఈ సినిమాను జూలై 11న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుగు ఓటీటీ వేదికలు ‘ఈటీవీ విన్’తో పాటు ‘ఆహా’ (Aha) ప్రకటించాయి. కానీ విడుదల తేదీని వాయిదా వేస్తూ కొత్త విడుదల తేదీని ప్రకటించాయి. జూలై 18వ తేదీన ఈ మూవీని తీసుకురానున్నట్లు ‘ఈటీవీ విన్’ వెల్లడించింది.
అయితే ఈ సినిమా వాయిదాకు తెలుగు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు కారణం అని తెలుస్తుంది. ప్రణీత్ హనుమంతు ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు. అయితే రీసెంట్గా ప్రణీత్ తండ్రీకూతుళ్ల బంధంపై చేసిన వ్యాఖ్యల కారణంగా అతడిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రస్తుతం అతడు చంచల్‌గూడలో జైలు జీవితం గడుపుతున్నాడు. అయితే ‘హరోంహర’ సినిమాలో అతడు కనిపిస్తే మూవీకి నెగిటివ్ అయ్యే అవకాశం ఉందని అందుకే అతడి సీన్స్ కట్ చేసి ఓటీటీకి కొత్త వెర్షన్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది.
1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా వచ్చింది. ఈ మూవీలో మాళవిక, సునీల్ రవి కాలే, కేజీఎఫ్ ఫేమ్ లక్కీ లక్ష్మణ్, అర్జున్ గోవిందా కీలక పాత్రల్లో కనిపించారు.
Also Read..
Mahesh Babu | నైజాం నవాబ్.. అనంత్ అంబానీ వెడ్డింగ్‌లో మహేశ్ బాబు లుక్ వైరల్
Shah Rukh Khan | అమితాబ్ బచ్చన్ కాళ్లు మొక్కిన షారుఖ్ ఖాన్.. వీడియో వైరల్
Rajinikanth Dance | అనంత్ అంబానీ వెడ్డింగ్‌లో రజినీకాంత్ డ్యాన్స్.. వీడియో