బంజారాహిల్స్: రాత్రికి రాత్రే జలమండలికి చెందిన పైప్లైన్లను ధ్వంసం చేసి పెద్దసంఖ్యలో అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకున్న 19 మందిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. రోడ్ నం. 12లోని శ్రీరాంనగర్ బస్తీలో పాడైపోయిన రోడ్డు స్థానంలో కొత్తగా సీసీ రోడ్డు వేసేందుకు తవ్వకాలు చేశారు. దీంతో ఒకటి రెండు నల్లా కనెక్షన్లు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న నల్లా పైపులైన్‌ను స్థానంలో కొందరు వ్యక్తులు కొత్త లైన్ వేసుకున్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం ఉన్న అధికారిక కనెక్షన్‌కు అదనంగా 15 ఎంఎం డయాతో అక్రమంగా కనెక్షన్ కలుపుకొన్నారు.
సమాచారం అందుకున్న వీధిలోని వారంతా ఎవరికి తోచిన విధంగా వాళ్లు జలమండలి వాటర్లైన్ను ధ్వంసం చేసి పెద్ద సంఖ్యలో అక్రమ కనెక్షన్లు తీసుకున్నారు. రెండ్రోజుల్లో సీసీ రోడ్డు వేస్తే అక్రమ కనెక్షన్లను ఎవరూ గుర్తించలేరని అక్రమ కనెక్షన్లకు సంబంధించిన పైపులైన్లు కనిపించకుండా మట్టితో పూడ్చేశారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న జలమండలి తట్టిఖానా సెక్షన్ మేనేజర్ రాంబాబు తన సిబ్బందితో వెళ్లి అక్రమ కనెక్షన్లను గుర్తించారు.
జలమండలి పైపులను ధ్వంసం చేసి అక్రమ కనెక్షన్లు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని తట్టిఖానా సెక్షన్ మేనేజర్ రాంబాబు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్. ప్రభాకర్‌రావు, ఎం.బాలమ్మ, షకీల్ బేగం, వి.బాలమ్మ, షాలా బాయి, మహ్మద్ మన్నన్ అన్సారీ, పర్వతాలు, జబ్బార్ షరీఫ్, షేక్ మహమూద్, బల్లు బాయి, రాజు, సీహెచ్. రమేశ్‌బాబు, కొమరయ్య, ఏసుపాదం, జి.పాపయ్య, మహ్మద్ రహీమ్ అహ్మద్, పుత్లీబేగం, సయ్యద్ సిద్ధిఖ్ అలీ, వెంకటేశ్‌లపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.