Benefit Shows | ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో బుధవారం రాత్రి పుష్ప 2 (Pushpa 2 The Rule) బెనిఫిట్ షో నేపథ్యంలో అల్లు అర్జున్ రాక సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళ మృతి చెందగా. ఆమె కుమారుడు శ్రీతేజ్ (9) గాయాలపాలై నిమ్స్హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ టీం, థియేటర్ యాజమన్యాంపై కేసు కూడా నమోదు చేశారు పోలీసులు.
తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇక కొత్తగా విడుదలయ్యే సినిమాలకు బెన్ఫిట్ షోలకు అనుమతించమని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇకపై తెలంగాణలో ఉదయం 7 గంటలకే తొలి షో ఉండే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సీజన్లో విడుదల సినిమాలపై ప్రభావం పడే అవకాశం బాగానే ఉంది.
సంధ్య థియేటర్ మూసివేతకు సిఫార్సు..
సంధ్య థియేటర్ ఘటనపై ఇప్పటికే డీసీపీ మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ మూసివేతకు సిఫార్సు చేశాం. టిక్కెట్స్ తనిఖీల కోసం ప్రేక్షకులను ఒక్కసారిగా అనుమతించారు. థియేటర్ లోపల తొక్కిసలాటతో ఊపిరాడక అవస్థలు పడ్డారు. థియేటర్లో రేవతి, ఆమె కుమారుడు స్పృహ కోల్పోయారు. రేవతి చనిపోయినట్టుగా వైద్యులు నిర్దారించారని చెప్పారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్, సెక్యూరిటీ సిబ్బందిపై కేసులు నమోదు చేశాం. ముందస్తు చర్యల్లో భాగంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం.అల్లు అర్జున్ వస్తున్న విషయం మాకు చెప్పలేదు. థియేటర్ యాజమాన్యం టిక్కెట్స్ అమ్మకాలు, తనిఖీలో నిర్లక్ష్యం వహించిందని పేర్కొన్నారు.
Rashmika Mandanna | రష్మిక మందన్నా ఏంటీ సంగతి..? విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో ఏఎంబీ మాల్లో..
Fahadh Faasil | ఎక్జయిటింగ్ అనిపించిందే చేశానంటున్న పుష్ప యాక్టర్ ఫహద్ ఫాసిల్