Milind Soman’s Mother | బాలీవుడ్ నటుడు ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ మిలింద్ సోమన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన ఫిట్నెస్తో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ ఫిట్నెస్కి తన తల్లి నుంచే స్ఫూర్తి పొందానని చాలాసార్లు ప్రకటించాడు. అయితే మిలింద్ సోమన్ తల్లి ఉషా సోమన్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారారు. 86 ఏళ్ల వయసులో ఆమె స్కిప్పింగ్ చేస్తున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కుటుంబంతో కలిసి స్కిప్పింగ్ టైం. అమ్మ వయసు ఇప్పుడు 86 ఏండ్లు. ఈ వయసులో కూడా ఆమె రోజు యోగా, ఇతర వ్యాయామాలతో పాటు స్కిప్పింగ్ కూడా చేస్తుంది. జీవితాంతం ఆమె ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అంటూ మిలింద్ రాసుకోచ్చాడు.