Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత మళ్లీ తన వ్యక్తిగత జీవితం, ఆలోచనలు గురించి ఓపెన్‌గా మాట్లాడారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సమంత చెప్పినదాని ప్రకారం, 20 ఏళ్ల వయసులో తాను గుర్తింపు కోసం పరుగులు పెట్టి, రెస్ట్ లేకుండా జీవితం గడిపేసిందని, ఆ ప్రక్రియలో తనను తాను కోల్పోయానని పేర్కొన్నారు. ప్రేమ అంటే ఏమిటో ఎవరూ చెప్పలేదు. కానీ 30 ఏళ్లకు వచ్చేసరికి మహిళలు చూసే ప్రతి విషయం భిన్నంగా ఉంటుంది. అందం, ఆలోచనల్లో మార్పు వస్తుంది” అని చెప్పారు. మనల్ని మనమే ప్రేమించుకోవడమే నిజమైన ప్రేమ అని ఇప్పుడు అర్థమైంది.
నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకున్నాను. గతంలో చేసిన తప్పుల జ్ఞాపకాలను మోయడం మానేశాను. ప్రతి అమ్మాయి కూడా ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను” అంటూ భావోద్వేగంగా మాట్లాడారు.ఇక అభిమానులకు పలు విషయాల గురించి సూచించిన సమంత.. జీవితాన్ని ఆస్వాదించండి, పరుగు తగ్గించండి. మీరు మీలా ఉన్నప్పుడే గర్వంగా, ధైర్యంగా, ఆనందంగా ఉండగలరు. అప్పుడే నిజమైన స్వేచ్ఛ అనుభూతి వస్తుంది” అని చెప్పారు.ఈ వ్యాఖ్యలతో సమంత చైతన్యతో విడాకుల తర్వాత ఎదుర్కొన్న ఒత్తిడి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తోందని, ఇంకా పూర్తిగా తేరుకోలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆమె చెప్పిన మాటల్లో కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది.
కెరీర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడ్డ సమంత ఆ తర్వాత మెల్లగా నిలదొక్కుకొని స్టార్ హీరోయిన్గా ఎదిగింది. పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ ఓ రేంజ్‌కి వెళ్లిన తర్వాత అక్కినేని హీరో నాగ చైతన్యని వివాహం చేసుకుంది. నాలుగేళ్ల తర్వాత ఎందుకో వారిరివురు విడిపోయారు. ఇప్పటికీ వారి విడాకులకి సంబంధించి క్లారిటీ లేదు. ఇక మయోసైటిస్ బారిన పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సమంత క్రమంగా కోలుకొని కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్: హానీ, బన్నీ లాంటి సినిమాలతో సమంత క్రేజ్ బాలీవుడ్‌కి కూడా పాకింది. ప్రస్తుతం నిర్మాతగా కూడా సత్తా చాటుతుంది.