Oka Manchi Prema Katha Trailer | రోహిణి హట్టంగడి, రోహిణి ముల్లేటి, సముద్రఖని, హిమాంశు పోపూరి, సౌమ్య, అనన్య నన్నపనేని లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘ఒక మంచి ప్రేమ కథ’. అక్కినేని కుటుంబరావు కథనందిస్తూ దర్శకత్వం వహించాడు. మేకర్స్ ఈ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
మీ గుండె కొంచెం బలహీనంగా ఉంది. కానీ దాన్ని కొంచెం పట్టించుకోవాలి. మీ అమ్మాయి సుజాత గారు ఎక్కడుంటారు.. ? అని డాక్టర్ అడిగితే పోయినవాళ్లు ఫొటోలై మిగులుతారు. వీళ్లు మాత్రం నాకు ఉండి కూడా ఫొటోల్లాగే మిగిలారు.. డబ్బులాగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే ప్రేమ పెరుగదంటోంది పెద్దావిడ.
ఇక కూతురు దగ్గరలో ఏమైనా ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయా..? అని అడిగితే నాకు ఇష్టమో లేదో కనుక్కోవాలి కదా అని తల్లి అంటోంది. ఇష్టం ఏమిటి అవసరం.. పిల్లల కోసం తల్లిదండ్రులకు దొరికిన సెలవులు.. తల్లిదండ్రుల కోసం పిల్లలకు ఎందుకు దొరకవు అంటూ తల్లీకూతుళ్ల మధ్య జరిగే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేసేలా సాగుతున్నాయి.
కోర్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాను. ఇప్పుడు ఒక మంచి ప్రేమ కథ సినిమాతో వస్తున్నా. ఓల్గా రాసిన కథ నాకు చాలా నచ్చింది. చాలా ఏండ్ల క్రితం నటించిన నేను, రోహిణి మళ్లీ ఇన్నాళ్లకు నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నా పాత్రను చూసి ప్రేక్షకులు కోప్పడతారని చెప్పుకొచ్చింది రోహిణి ముల్లేటి.
సినిమాకు స్క్రిప్ట్ ఎంత ముఖ్యమో.. ఆర్టిస్టులు అంత ముఖ్యం. రోహిణి హట్టంగడికి 37 ఏళ్ల తర్వాత ఆమెకు ఈ కథ చెప్పడానికి వెళ్లాను. రోహిణి ముల్లేటి లేకపోతే ఈ సినిమా ముందుకొచ్చేది కాదు. సముద్రఖని ఎంత బిజీగా ఉన్నామాకు సపోర్ట్ చేశారు. కోట్లు సంపాదించేందుకు పరుగులు పెడుతున్నారు.. కానీ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు.. అందరిలో ఆలోచనను రేకెత్తించాలనే ఈ మూవీ తెరకెక్కించానన్నారు డైరెక్టర్ అక్కినేని కుటుంబరావు.
ఒక మంచి ప్రేమకథ ట్రైలర్..
Srinidhi Shetty | సిద్ధు పాత్రతో ప్రేమలో పడిపోతారు.. తెలుసు కదా సినిమాపై శ్రీనిధి శెట్టి
Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం వెబ్‌సిరీస్ జోనర్ ఇదేనట..!