స్వీయ దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మేమ్ ఫేమస్’. చాయ్ బిస్కెట్, లహరి ఫిల్మ్స్ నిర్మిస్తున్నాయి. జూన్ 2న విడుదలకానుంది. ఈ చిత్రంలో ‘మా తోటి మినిమమ్’ అనే పాటను గురువారం విడుదల చేశారు.
కల్యాణ్ నాయక్ సంగీతాన్నందించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ‘ఈ ఊర్లో పోరగాళ్లం..ఏదో లొల్లి చేసేదాక మేం గమ్మునుండం’ అంటూ పాట ఆద్యంతం హుషారుగా సాగింది. తెలంగాణ గ్రామీణ ప్రాంత నేపథ్యంలో నడిచే వినోదాత్మక చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ దూపాటి, సంగీతం: కల్యాణ్ నాయక్, నిర్మాతలు: అనురాగ్ రెడ్డి, శరత్చంద్ర, చంద్రు మనోహర్.