Meiyazhagan Movie | కోలీవుడ్ స్టార్ నటులు కార్తీ (Karthi), అరవింద స్వామి (Aravindha Swamy) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మెయ్యళగన్ (Meiyazhagan). ఈ సినిమాకు ’96’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన ప్రేమ్ కుమార్.సీ (Prem Kumar C) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో గ్లింప్స్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. దసరా కానుకగా ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు.
అయితే ఇదే రోజున టాలీవుడ్ నుంచి మరో పెద్ద సినిమా రాబోతుంది. టాలీవుడ్ నటుడు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో దేవర అనే మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా సెప్టెంబర్ 27 విడుదల కానుంది. దీంతో దసరా రోజు బిగ్ ఫైట్ జరుగనున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య- జ్యోతిక(Suriya – Jyothika) నిర్మిస్తుండగా.. రాజ్ కిరణ్, శ్రీదేవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 96 సినిమా సంగీత దర్శకుడు గోవింద్ వసంత (Govindha Vasantha) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
A breezy journey filled with celebratory moments await 🎇
Can’t wait for you all to witness the rooted emotions on Sep 27#MeiyazhaganFromSep27#Meiyazhagan@Karthi_Offl @thearvindswami #PremKumar @Suriya_offl #Jyotika @rajsekarpandian #Rajkiran @SDsridivya #Jayaprakash… pic.twitter.com/VMwBzRDf8V
— 2D Entertainment (@2D_ENTPVTLTD) July 17, 2024
Also Read..