సత్యం రాజేష్ హీరోగా డా.అనిల్ కుమార్ దర్శకత్వంలో నిర్మించిన క్రేజీ థ్రిల్లర్ ` పొలిమేర-1`ఓటీటీలో విడుదలై సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం సీక్వెల్ ` పొలిమేర-2 ` థియేటర్లలో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. అయితే ఇప్పుడు తాజాగా దీని సీక్వెల్ పొలిమేర-3 కూడా రాబోతుందని ఈ మధ్య కాలంలోనే ఈ చిత్రం యూనిట్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సీక్వెల్ లో సత్యం రాజేష్ హీరోగా,కామాక్షి భాస్కర్ల హీరోయిన్ల్ గా చాలా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అయితే పొలిమేర-2 చిత్రాన్ని రిలీజ్ చేసిన వంశీ నందిపాటి, పోలిమేర-2 నిర్మాత భోగేంద్రప్రసాద్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఈ ప్రకటన గురించి ఇప్పుడు వివాదం నడుస్తుంది. పొలిమేర-2 నిర్మాత గౌరీకృష్ణ, వంశీ నందిపాటి మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు చేశారు. పొలిమేర-3 (Polimera 3 ) సినిమా హక్కులు తన వద్ద వున్నాయని, ఈ సినిమాతో వంశీ నంది పాటికి సంబంధం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు గౌరికృష్ణ. కాగా వంశీ నంది పాటి ఈ చిత్రం హక్కులు నా దగ్గర ఉన్నాయని చెబుతున్నారు.
అయితే వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా నిర్మాణ గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు ఫిలించాంబర్ తో పాటు పలు సినీ పెద్దల వరకు కూడా తీసుకువెళ్లినట్లు సమాచారం. అయితే ఈ చిత్ర నిర్మాత గౌరీ కృష్ణ, వంశీ నందిపాటి మీద పోలీస్ స్టేషన్ లో కేసుపెట్టారు. పొలిమేర-3 సినిమా హక్కులు నావి అని తెలిసి కూడా వంశీ నందిపాటి ఈ సినిమాను తను నిర్మిస్తున్నట్లు ప్రకటన చేశాడు అని గౌరీ కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన వల్ల ప్రాణ హాని ఉందని రక్షణ కల్పించమని పోలీసులను ఆశ్రయించాడు నిర్మాత గౌరీకృష్ణ అయితే ప్రస్తుతం ఈ పంచాయితీ మళ్లీ సినీ పెద్దలకు చేరిందని సమాచారం.
Pushpa 2 The Rule | ట్రిప్‌లో అల్లు అర్జున్-సుకుమార్.. మరి పుష్ప ది రూల్ షూటింగ్ ఎప్పుడంటే..?
Sardar 2 | కార్తీ సర్దార్ 2 షూట్లో స్టంట్‌మ్యాన్ మృతి.. కారణమిదే..!
SIIMA 2024 | సైమా 2024లో దసరా, జైలర్ హవా.. ఎన్ని కేటగిరీల్లో నామినేట్ అయ్యాయంటే..?