Steel Plant | ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌కు భూమి పూజ : దేవేంద్ర ఫడ్నవీస్
Steel Plant : బయ్యారం స్టీల్ ప్లాంట్ ప్రతిపాదనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నోరు మెదపకపోతుంటే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పొరుగు రాష్ట్రాల్లో కొలువుతీరుతున్నాయి.
Steel Plant : బయ్యారం స్టీల్ ప్లాంట్ ప్రతిపాదనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నోరు మెదపకపోతుంటే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పొరుగు రాష్ట్రాల్లో కొలువుతీరుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని గడ్చిరోలిలో రూ. 10000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది.
ఈ స్టీల్ ప్లాంట్‌కు భూమి పూజ చేశామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. ఈ సమీకృత స్టీల్ ప్లాంట్‌తో స్ధానికులతో పాటు గిరిజనులకు పలు ప్రయోజనాలుచేకూరతాయని చెప్పారు. ఈ స్టీల్ ప్లాంట్‌లో దాదాపు 8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుందని తెలిపారు.
దేశ ఉక్కు అవసరాల్లో గడ్చిరోలి దాదాపు 30 శాతం ఉక్కును సమకూరుస్తుందని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో గడ్చిరోలి ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు ఈ ప్రాంత ఆర్ధిక ముఖచిత్రం మారుతుందని చెప్పారు. స్టీల్ ప్లాంట్‌తో స్ధానిక యువతకు, గిరిజనులకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.
Read More :
Delhi Excise Policy Case | ‘అందరికీ బెయిల్ వచ్చింది.. కేజ్రీవాల్‌కే రాలేదు’.. హైకోర్టులో ఢిల్లీ సీఎం న్యాయవాది
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

