Mammootty – Gautham Vasudev Menon | మలయాళం ఇండస్ట్రీలో ప్రస్తుతం ఫుల్ ఫామ్లో ఉన్నది ఏ నటుడు అని అడిగితే టక్కున వచ్చే సమాధానం మెగాస్టార్ మమ్ముట్టి. ప్రస్తుతం మమ్ముట్టి తీసినన్ని సినిమాలు నేటి కుర్ర హీరోలు కూడా తీయట్లే అంటే నమ్మక తప్పదు. గత ఏడాది కాథల్ ది కోర్ అంటూ బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ ఈ ఏడాది భ్రమయుగం, టర్బో సినిమాలతో మంచి విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే మమ్ముట్టి తన తదుపరి సినిమాను అనౌన్స్ చేశాడు.
‘ఏం మాయ చేసావే’, ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ చిత్రాల ఫేమ్ తమిళ స్టార్ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) దర్శకత్వంలో మమ్ముట్టి తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. ప్రోడక్షన్.06 గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్ బుధవారం అట్టహాసంగా జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభంకాగా.. మమ్ముట్టి సోంత నిర్మాణంలో ఈ మూవీ రాబోతున్నట్లు తెలుస్తుంది. కాగా.. ఈ సినిమాపై మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
From the Pooja Ceremony of @MKampanyOffl‘s Production No.6 , Directed by @menongautham pic.twitter.com/bkNQYFV0Qp
— Mammootty (@mammukka) July 10, 2024
Also Read..