Thangalaan | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటిస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ తంగలాన్ (Thangalaan). హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.
విక్రమ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ రానే వచ్చింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగే ఘటనల నేపథ్యంలో కట్ చేసిన ట్రైలర్ విక్రమ్ థ్రిల్లింగ్, అడ్వెంచరస్ రైడ్‌గా సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
తంగలాన్ కోసం విక్రమ్ మరోసారి ప్రాణం పెట్టేశాడని ట్రైలర్‌తో అర్థమవుతోంది. ఈ మూవీని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. తంగలాన్ నుంచి రిలీజ్ చేసిన విక్రమ్, మాళవికా మోహనన్ ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ అమాంతం పెంచేస్తున్నాయి.
ఈ సినిమా బంగారం, రక్తం, కన్నీటి చుట్టూ సాగే కథగా అడ్వెంచరస్ స్టోరీ నేపథ్యంలో ఉండనుందని ఇప్పటికే లాంఛ్ చేసిన తంగలాన్ గ్లింప్స్ చెబుతోంది. ఈ చిత్రంలో పశుపతి, డానియెల్ కల్టగిరోన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తంగలాన్ ట్రైలర్..
Only those who dare to die, get to live out here ❤️🔥
Here is the #Thangalan Trailer ▶️ Tamilhttps://t.co/bMQx4onLCt #ThangalanTrailer @Thangalaan @chiyaan @GnanavelrajaKe @StudioGreen2 @OfficialNeelam @parvatweets @MalavikaM_ @gvprakash @NehaGnanavel @dhananjayang… pic.twitter.com/IqLlvGZspB
— pa.ranjith (@beemji) July 10, 2024
Bharateeyudu 2 | గెట్ రెడీ.. కమల్‌హాసన్ ఇండియన్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ షురూ
Suriya | ఒకే ఫ్రేమ్‌లో సూర్య, అక్షయ్‌కుమార్.. సర్ఫీరా ప్రమోషన్స్ టైం
lavanya | రాజ్‌తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు.. లావణ్య కేసులో మరో ట్విస్ట్