Bharateeyudu 2 | కమల్‌హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ఇండియన్ 2 (Indian 2). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం జులై 12న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలవుతుంది. తెలుగులో భారతీయుడు 2గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కోసం ఇంట్రెస్టింగ్ వార్త తెరపైకి వచ్చింది.
భారతీయుడు 2 అడ్వాన్స్ బుకింగ్స్ షురూ అయ్యాయి. ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫాంలలో టికెట్ బుకింగ్ చేసుకోండి మరి. ఈ చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏసియన్ సురేశ్ ఎంటర్టైమెంట్ విడుదల చేస్తుంది. అవినీతి, లంచం బ్యాక్‌డ్రాప్ అంశాల నేపథ్యంలో సాగే ఈ మూవీలో ఎస్జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్, సముద్రఖని, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ తెరకెక్కిస్తున్నారు. భారతీయుడుకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ (AN INTRO) సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తూ.. సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. మరోవైపు ఈ ప్రాంఛైజీలో ఇండియన్ 3 కూడా రాబోతుండగా సినిమాలో ఎలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయోనని మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Advance booking for #Bharateeyudu2 is open now for 12th July , 2024🔥
Book your Tickets Now 🎟️🍿
Andhra and Telangana Grand Release By @asiansureshent On July 12th 💥 @IndianTheMovie 🇮🇳 Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh @anirudhofficial #Siddharth @Rakulpreet pic.twitter.com/93fXb5oDl3
— Asian Cinemas (@AsianCinemas_) July 10, 2024
Shankar | మమ్మల్ని నమ్మండి… అంతకంటే ఎక్కువే శ్రమించాం.. డైరెక్టర్ శంకర్ కామెంట్స్ వైరల్
Indian 2 | ఇండియన్ 3 ట్రైలర్ అప్పుడే.. గేమ్ ఛేంజర్ రిలీజ్‌పై ఎస్జే సూర్య ఏమన్నాడంటే..?
ఇండియన్ 2 INTRO ..