Saripodhaa Sanivaaram | ఒక శనివారం ముందు.. నాని సరిపోదా శనివారం టీం సర్ప్రైజ్
Saripodhaa Sanivaaram | న్యాచురల్ స్టార్ నాని (Nani) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaaram). మేకర్స్ ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం తాజాగా సర్ప్రైజ్ వీడియో ఒకటి షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Saripodhaa Sanivaaram | న్యాచురల్ స్టార్ నాని (Nani) ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ఈ స్టార్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). నాని 31గా వస్తోన్న ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో గ్యాంగ్‌లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. మేకర్స్ ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం తాజాగా సర్ప్రైజ్ వీడియో ఒకటి షేర్ చేశారు.
50 రోజుల్లో ఒక శనివారం ముందు.. థియేటర్లలో మాస్ వైభవానికి నాంది పలుకుదామని షూటింగ్ లొకేషన్ గ్లింప్స్ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నాని, ప్రియాంకా మోహన్ కాంబోలో గ్యాంగ్‌లీడర్ తర్వాత వస్తున్న రెండో సినిమా ఇది. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్‌తోపాటు ప్రియాంక అరుళ్ మోహన్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ మూవీలో ఎస్జే సూర్య (SJ Suryah) కీలక పాత్రలో నటిస్తుండగా.. జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిస్తోంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో వస్తుండగా.. ఇతర భాషల్లో Suryas Saturday టైటిల్‌తో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గరం గరం సాంగ్‌ను విడుదల చేయగా.. మంచి స్పందన వస్తోంది. అంటే సుందరానికి తర్వాత నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రం ఆగస్టు 29న విడుదల కానుంది.
50 రోజుల్లో..
50 Rojullo……
Oka Sanivaaram Mundhu…🔥🔥Theatres lo Mass Vaibhavaniki Naandhi palukudham 🤙🏽🤙🏽#SaripodhaaSanivaaram #SuryasSaturday pic.twitter.com/QYowGLtWht
— DVV Entertainment (@DVVMovies) July 10, 2024
Read Also :
Kalki 2898 AD | ప్రభాస్ కల్కి 2898 ఏడీ కలెక్షన్స్‌కు అదే మైనస్ అయ్యిందా?
Suriya | ఒకే ఫ్రేమ్‌లో సూర్య, అక్షయ్‌కుమార్.. సర్ఫీరా ప్రమోషన్స్ టైం
lavanya | రాజ్‌తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు.. లావణ్య కేసులో మరో ట్విస్ట్
Polimera 3 | అఫీషియల్ థ్రిల్లింగ్ న్యూస్.. సత్యం రాజేశ్ పొలిమేర 3 వచ్చేస్తుంది
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

