Kalki 2898 AD | ప్రభాస్ కల్కి 2898 ఏడీ కలెక్షన్స్‌కు అదే మైనస్ అయ్యిందా?
Kalki 2898 AD | ప్రభాస్ (prabhas) నటించిన యూనివర్సల్ చిత్రం కల్కి 2898A (Kalki 2898 AD). జూన్ 27న విడుదలైన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందనతో పాటు బాక్సాఫీస్ బొనాంజా కలెక్షన్లతో దూసుకుపోతుంది.
Kalki 2898 AD | ప్రభాస్ (prabhas) నటించిన యూనివర్సల్ చిత్రం కల్కి 2898A (Kalki 2898 AD). దీపికా పదుకునే కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఇండియన్ సినిమా లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ నటించడంతో.. ఈ చిత్రం వాల్యూ మరింత పెరిగింది. 1985లో కల్ట్ క్లాసిక్ గెరాఫ్తార్‌లో కలిసి నటించిన ఈ లెజెండ్ ద్వయం దాదాపు 39 సంవత్సరాల తరువాత ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. జూన్ 27న విడుదలైన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందనతో పాటు బాక్సాఫీస్ బొనాంజా కలెక్షన్లతో దూసుకుపోతుంది.
సైకాలాజికల్, మైథలాజికల్, సోషల్ డ్రామా ఇలా డిఫరెంట్ జానర్లను కలిపి ఓ కొత్త ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు. ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రియాంకదత్, స్వప్నాదత్లు దాదాపు 600 కోట్ల వ్యయంతో నిర్మించారు. అయితే ఈ చిత్రానికి వచ్చిన పాజిటివ్ టాక్, బజ్‌ను బట్టి ఈ సినిమా కలెక్షన్లు సునాయసంగా 1000 కోట్లకు పైగా వసూలు చేస్తుందని అంచనా వేశారు. సినిమా రిలిజై దాదాపు రెండు వారాలు దాటింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 840 కోట్ల గ్రాస్‌కు చేరుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం దాదాపు 250 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో నైజాంలో 120 కోట్లు, 130 కోట్లు ఏపీలో వసూలు చేసింది.
అయితే ‘కల్కి 2898AD’ సినిమాకు వచ్చిన బజ్, పాజిటివ్ టాక్, రివ్యూలను బట్టి చూస్తే ఈ చిత్రం ఇంతకంటే ఎక్కువే వసూలు చేయాల్సిందని కొంత మంది అంటున్నారు. దీనికి ముఖ్యకారణం టిక్కెట్ల రేట్లు పెంచడమే అని అంటున్నారు. మల్టీప్లైక్స్లో ఈ చిత్రం టిక్కెట్ రేటు 400 రూపాయల నుండి 500 వరకు వుండటంతో చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు అంతగా ఆసక్తి చూపలేదని చెబుతున్నారు. కనీసం రెండో వారంలోనైనా టిక్కెట్ల ధర తగ్గించి వుంటే.. ఖచ్చితంగా కలెక్షన్లు మరింత పెరిగేవి అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
టిక్కెట్ల ధర తమకు అందుబాటులో లేకపోవడంతో మిడిల్‌క్లాస్ ఆడియన్స్ ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అని థియేటర్లకు వైపు వెళ్లడానికి ఆసక్తి చూపలేదు. కానీ ‘కల్కి 2898AD’ సినిమాను థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా.. ఇలాంటి సినిమాను కూడా టిక్కెట్ల రేట్ల వల్ల ఆడియన్స్ చూడలేకపోవడం కాస్త ఇబ్బందికరమే. సో.. ‘కల్కి 2898AD’ సినిమా వసూళ్లకు టిక్కెట్ల ధర పెంపుదల ఎంత అడ్వాంటేజీ అయ్యిందో.. అంతే మైనస్ అయ్యిందని కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.
Read Also :
Suriya | ఒకే ఫ్రేమ్‌లో సూర్య, అక్షయ్‌కుమార్.. సర్ఫీరా ప్రమోషన్స్ టైం
lavanya | రాజ్‌తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు.. లావణ్య కేసులో మరో ట్విస్ట్
Polimera 3 | అఫీషియల్ థ్రిల్లింగ్ న్యూస్.. సత్యం రాజేశ్ పొలిమేర 3 వచ్చేస్తుంది
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

