lavanya | రాజ్‌తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు.. లావణ్య కేసులో మరో ట్విస్ట్
lavanya | టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్ (Raj Tarun)పై అతని ప్రేయసి లావణ్య (lavanya) వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా లావణ్య మరోసారి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
lavanya | టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్ (Raj Tarun)పై అతని ప్రేయసి లావణ్య (lavanya) వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ కారణంగా వదిలేసి వెళ్లిపోయాడని ఇప్పటికే నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది లావణ్య. అయితే లావణ్య పిర్యాదులో పేర్కొన్న విషయాలన్నీ అబద్దాలనీ.. ఆమె డ్రగ్స్‌కు బానిసవడంతో చాలా కాలం క్రితమే లావణ్యతో బ్రేకప్ చేసుకున్నానని మరోవైపు రాజ్‌తరుణ్ కూడా చెప్పాడు.
విచారణలో భాగంగా ఫిర్యాదులో పేర్కొన్న విషయాలపై ఆధారాలు చూపించాలని లావణ్యను కోరినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా లావణ్య మరోసారి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రాజ్‌తరుణ్‌తో నాకు పదేళ్ల క్రితమే పెళ్లయింది. పదేళ్లుగా మేం కాపురం చేస్తున్నాం. కొన్నాళ్ల క్రితం రాజ్‌తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు. మెడికల్ డాక్యుమెంట్స్‌ను పోలీసులకు అందించా. లావణ్య అలియాస్ అన్విక పేరుతో కలిసి ఉన్నాం. అన్విక పేరుతో విదేశాలకు కూడా కలిసి వెళ్లాం. మాల్వీ మల్హోత్రా వచ్చాక రాజ్ తరుణ్ నన్ను దూరం పెట్టాడని పోలీసులకు స్పష్టం చేసింది.
పోలీసులకు లావణ్య 170 ఫొటోలు, సాంకేతిక ఆధారాలను సమర్పించింది. దీంతో ఐపీసీ 493 సహా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో లావణ్య సమర్పించిన ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరి రాజ్‌తరుణ్-లావణ్య కేసు ఎటువైపు మలుపులు తిరుగుతుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేను..
నేను రాజ్ తరుణ్ లైఫ్‌లోకి హీరో అయ్యాకా రాలేదు.. అతడు ఉయ్యాలా జంపాలా సినిమా తీసే టైంలోనే పక్క పక్క ఇళ్లల్లో ఉండేవాళ్లం. మా పెళ్లి విషయం సమయం వచ్చినప్పుడు నేనే బహిరంగంగా ప్రకటిస్తానని చెప్పడంతో అతడిని నమ్మాను. రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేను. నేను ముసలిదాన్ని అయినా కూడా అతనే నా మనసులో ఉంటాడని లావణ్య ఇప్పటికే మీడియాతో వెల్లడించిన విషయం తెలిసిందే.
Read Also :
Raj Tarun | ఆ విషయంలో లావణ్య ఫెయిల్.. రాజ్ తరుణ్‌కు క్లీన్చిట్..?
Raj Tharun – Lavanya | రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేను : లావణ్య
Raj Tharun – Lavanya | రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్.. లావణ్యకు నోటీసులు ఇచ్చిన పోలీసులు
Polimera 3 | అఫీషియల్ థ్రిల్లింగ్ న్యూస్.. సత్యం రాజేశ్ పొలిమేర 3 వచ్చేస్తుంది
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

