Polimera 3 | టాలీవుడ్లో వచ్చిన థ్రిల్లర్ ప్రాంఛైజీల్లో టాప్లో ఉంటుంది మా ఊరి పొలిమేర. సత్యం రాజేశ్ (Satyam Rajesh), కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన ఫస్ట్ పార్టు కరోనా సంక్షోభం టైంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ప్రీమియర్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంద. ఆ తర్వాత సీక్వెల్ మా ఊరి పొలిమేర 2 (Ma Oori Polimera 2) థియేటర్లలో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. హార్రర్ థ్రిల్లర్ జోనర్లో డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ ప్రాంఛైజీలో ఇక మూడో పార్టు కూడా రాబోతుంది.
తాజాగా పొలిమేర 3ను ప్రకటించారు. పొలిమేర నెక్ట్స్ లెవల్ పొలిమేర 3 (Polimera 3).. స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది.. ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ అయ్యాయి.. అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేసి క్యూరియాసిటీ పెంచుతున్నారు మేకర్స్. పొలిమేర 2ను పంపిణీ చేసిన వంశీ నందిపాటి భోగేంద్ర గుప్తాతో కలిసి పొలిమేర 3 నిర్మిస్తున్నారు. భోగేంద్ర గుప్తా ఫస్ట్ పార్టుకు నిర్మాతగా వ్యవహరించగా.. పొలిమేర 3కి భోగేంద్ర గుప్తా సహ నిర్మాతగా వ్యహరిస్తున్నారు. ఈ చిత్రంలో గెటప్ శీను, రాకేందు మౌళి, సాహిత్య దాసరి, రవివర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఇప్పటికే ఫస్ట్ పార్టు, సెకండ్ పార్టు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాయి. మరి ఇదే జోనర్లో కొనసాగింపుగా వస్తోన్న త్రీక్వెల్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
The Much Awaited #Polimera3 Announcement Crosses Borders💥
“#Polimera3Loading..” Trending at the Top in India on @X ❤️🔥
Journey begins!🤩
A @DrAnilViswanath Film
Produced by @connect2vamsi – #VamsiNandipati
Co-Produced by #BhogendraGupta⭐️ing @Satyamrajesh2… pic.twitter.com/MAUaItl2tF
— GSK Media (@GskMedia_PR) July 10, 2024