Megastar Chiranjeevi | దిగ్గజ నటుడు, కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 ఏండ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు కన్నడ సినీ ప్రముఖులతో ఇతర భాష నటులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా అగ్ర కథానాయకుడు చిరంజీవి కూడా శివరాజ్‌కుమార్‌కి ప్రత్యేక విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ఒక వీడియోను విడుదల చేశాడు.
శివరాజ్ కుమార్ తండ్రి నటుడు రాజ్ కుమార్‌తో నాకు ప్రత్యేకమైన అనుభందం ఉంది. ఆయన నాకు తండ్రిలాంటివారు. అతను కేవలం ఒక సూపర్ స్టార్ కంటే కూడా ఒక డెమి గాడ్. అతడితో ఉన్న రిలేషన్ వలన వారి ఫ్యామిలీ నాకు కూడా కుటుంబంలాగా మారిపోయింది. అతడి కొడుకులు శివరాజ్ కుమార్, అప్పు(పూనీత్ రాజ్ కుమార్), రాఘవేంద్ర నా ఫ్యామిలీగా మారారు. అయితే రాజ్‌కుమార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే సూపర్‌స్టార్‌గా ఎదిగాడు శివరాజ్ కుమార్. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ అద్భుతమైన విజయాన్ని సాధించారు. నా కళ్ళ ముందే సూపర్‌స్టార్‌గా ఎలా ఎదిగాడో చూడటం నా హృదయాన్ని ఆనందంతో, గర్వంతో నింపుతుంది. ఆయన సినిమాల్లోకి వచ్చి అప్పుడే 40 పూర్తి చేసుకున్నారంటే నమ్మబుద్ది కావట్లేదు. ఇది ఎంతో ఎంత అద్భుతమైన ప్రయాణం. ఈ మైలురాయిని చేరుకున్నందుకు నిన్ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నువ్వు ఇలాంటి మరిన్ని విజయాలను సాధించాలని.. అభిమానులతో పాటు యువతకి మీ సినిమాలు స్పూర్తిగా నిలవాలని చిరంజీవి చెప్పుకోచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Megastar @KChiruTweets Garu extends heartfelt wishes to @NimmaShivanna on completing 40 glorious years in cinema! ❤️
A journey marked by dedication, passion, and iconic performances. Here’s wishing many more milestones ahead! 💐
#DrShivarajkumar #Shivanna40 #PEDDI pic.twitter.com/C9xDfxBH9d
— Suresh Kondeti (@santoshamsuresh) June 10, 2025
Read More