Kota Srinivasa Rao | తెలుగు సినిమా తెరపై విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న కోట శ్రీనివాసరావు తెలుగు సినిమా రంగంపై తనదైన ముద్ర వేశారు. కమెడీయన్, విలన్‌గా తనదైన శైలిలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఏ పాత్ర అయిన అవలీలగా పోషించి నవరసాలు పండించగల బహుముఖ నటుడు కోట శ్రీనివాసరావు. టాలీవుడ్లో రావు గోపాల రావు తర్వాత తెలుగు విల నిజానికి సరికొత్త సొబగులద్దిన నటుడు కోట అని చెప్పడంలో అతిశయోక్లి లేదు. దాదాపు ఏడు వందల పైచిలుకు చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించిన కోట వయోభారం వలన ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. చాలా రోజులుగా కోట మీడియాలో కూడా పెద్దగా కనిపించడం లేదు.
రీసెంట్గా కోటని ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కలిసాడు. ఆయన ఇంటికి వెళ్లి మరీ ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ఇక కోటతో కలిసి దిగిన ఫోటోను బండ్ల గణేష్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ” కోట శ్రీనివాసరావు గారితో ఈరోజు.. కోటా బాబాయ్ ను కలవడం చాలా సంతోషాన్నిచ్చింది” అంటూ రాసుకురాగా, ఇందులో కోటని చూసి అభిమానులు షాక్ అయ్యారు. ఏంటి మరీ ఇంత వీక్ అయ్యారు. కాలికి కట్టుతో, సన్నబడిపోయి అసలు గుర్తుపట్టలేన్నంతగా మారిపోయారు. ఒకప్పుడు తెరపై తనదైన ముద్ర వేసిన కోటని ఇలా చూసి అభిమనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోట శ్రీనివాసరావు ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు అభిమానులని ఎంతగానో కలిచి వేస్తున్నాయి. ఆయన ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. కోట ఆ మధ్య పలు ఇంటర్వ్యూలలో కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి వార్తలలో నిలవడం మనం చూశాం. స్టార్ హీరోలు, డైరెక్టర్స్‌పై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. తుదిశ్వాస తీసుకొనేవరకు సినిమాల్లో నటించాలని ఉందని, కానీ, మేకర్స్ ఎవరు తనకు ఛాన్స్ లు ఇవ్వడం లేదని కోట ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. కోటా చివరగా 2023 లో వచ్చిన సువర్ణ సుందరి అనే సినిమాలో కనిపించారు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు ఈయన స్టేట్ బ్యాంకులో పనిచేసేవారు.