Road Accident | రంగారెడ్డి : యాచారం మండలం మాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్‌లో నివాసం ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న ఏడుగురు స్నేహితులు కలిసి నిన్న నాగార్జున సాగర్‌లోకి వైజాగ్ కాలనీకి వెళ్లారు. మళ్లీ అర్ధరాత్రి తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా.. వారి కారును బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదం మాల్ వద్ద నాగార్జున సాగర్ రహదారిపై జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను మహబూబ్‌నగర్‌కు చెందిన సాయితేజ, పవన్, రాఘవేంద్రగా పోలీసులు గుర్తించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.