Happy Ganesh Chaturthi | వినాయక చవితిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు అటు రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు భారాస అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని వినాయకుడిని వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు.
అయితే తాజాగా దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపాడు. విఘ్నాలకు అధిపతైన విఘ్నేశ్వరుడి కృపతో అందరి జీవితాల్లో అడ్డంకులు తొలగి ఆనందము వెల్లివిరియాలని ప్రార్థిస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ ఎక్స్ వేదికగా రాసుకోచ్చాడు.
విఘ్నాలకు అధిపతైన విఘ్నేశ్వరుడి కృపతో అందరి జీవితాల్లో అడ్డంకులు తొలగి ఆనందము వెల్లివిరియాలని ప్రార్థిస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు !🙏
Happy Ganesh Chaturthi to All! pic.twitter.com/K2WhZQbscc
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 7, 2024