చిరంజీవి మామూలోడు కాదు.. నవ్వుతూనే అన్నీ చెప్పేశాడు..
Mega star Chiranjeevi | లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన నవ్వుతూనే ఈ మాటలు చెప్పినా కూడా వాటి అంతరార్థం మరోలా ఉంది.
Mega star Chiranjeevi | లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన నవ్వుతూనే ఈ మాటలు చెప్పినా కూడా వాటి అంతరార్థం మరోలా ఉంది. ఇప్పుడు దీని గురించి సోషల్ మీడియాలో చర్చ బాగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా అల్లు రామలింగయ్యతో తన పరిచయం.. ఆ తర్వాత అతనికి అల్లుడయ్యే క్రమంలో వాళ్ళు చేసిన పనుల గురించి చిరంజీవి చాలా ఫన్నీగా చెప్పాడు. 1978 మన ఊరి పాండవులు షూటింగ్లో మొదటిసారి అల్లు రామలింగయ్యను చూశానని.. అప్పటి నుంచే తనపై ఆయన కన్ను పడింది అంటూ కామెడీ చేశాడు చిరంజీవి.
ఆ తర్వాత తాను ఎక్కడికి వెళ్లినా కూడా ప్రత్యేక దృష్టి పెట్టి.. ఈ కుర్రాడికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు.. అమ్మాయిలకు దూరంగా ఉన్నాడు.. ఇప్పుడు వీడిని వదిలేస్తే మళ్లీ చేయి జారిపోతాడు.. ఇంటి అల్లుణ్ని చేసుకుంటే ఓ పని అయిపోతుంది అని అందరూ కలిసి ప్లాన్ చేసి తనకు సురేఖను ఇచ్చి పెళ్లి చేశారు అంటూ చిరంజీవి చేసిన కామెంట్స్ అందర్నీ కడుపు చెక్కలయ్యేలా నవ్వించాయి. కేవలం పాతికేళ్ల వయసులో తనను ఒక పొట్టేలులా ముస్తాబు చేసి పెళ్లి పీటలపై కూర్చోబెట్టారు అంటూ సెటైర్స్ వేశాడు మెగాస్టార్.
తన ఫ్యూచర్‌ను అల్లు ఫ్యామిలీ అప్పుడే అంచనా వేసిందని.. ముఖ్యంగా అల్లు అరవింద్ అయితే ఇతడిని బావగా చేసుకుంటే నా ఫ్యూచర్ కూడా బాగుంటుంది అని అప్పుడే ప్లాన్ చేసుకున్నాడని.. అంతా కలిసి నాలాంటి అమాయకుడిని వలవేసి పట్టుకున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు మెగాస్టార్. జోక్స్ పక్కన పెడితే అల్లు రామలింగయ్య ఇంటి అల్లుడవ్వడం తన అదృష్టమని.. ఇంత మంచి కుటుంబంలో తాను కూడా ఉండటం ఎప్పుడూ సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పాడు చిరంజీవి. అల్లు రామలింగయ్య నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని.. చనిపోయిన ఆయన రెండో కొడుకును తనలో చూసుకున్నాడు అంటూ ఎమోషనల్ అయ్యాడు చిరంజీవి.
Read More :
“అల్లు అర్జున్ మరో బాంబు.. తాత సాక్షిగా ఫ్యాన్స్‌ను చీల్చాడుగా..!”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

