‘గాడ్ ఫాదర్’ వెనక చిరంజీవి మాస్టర్ ప్లానింగ్ సక్సెస్ అయ్యేనా..?
మొన్నటి వరకు గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ నెమ్మదిగా సాగాయి అంటూ చేసిన కంప్లైంట్స్ అన్ని ఒకసారిగా ఎగిరిపోయాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
రెండు మూడు రోజుల్లోనే గాడ్ ఫాదర్ సీన్ అంతా మారిపోయింది. మొన్నటి వరకు ఈ సినిమా ప్రమోషన్స్ నెమ్మదిగా సాగాయి అంటూ చేసిన కంప్లైంట్స్ అన్ని ఒకసారిగా ఎగిరిపోయాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరీ ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ నాయకులకు తగిలేలా సెటైర్లు కూడా వేశారు మెగాస్టార్.
అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అన్న చందంగా ప్రస్తుతం రాజకీయ నాయకులు ఉన్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు చిరంజీవి. సినిమాలో మురళీ శర్మ క్యారెక్టర్ గురించి చెప్తూ.. నేటితరం పొలిటికల్ లీడర్స్‌పై తన మాటల తూటాలు పేల్చాడు అన్నయ్య. ఒకవైపు వర్షం జోరుగా కురుస్తున్న మరోవైపు తన మాటల వర్షంతో అభిమానులను పూర్తిగా తడిపేసాడు చిరంజీవి.
దాదాపు 14 ఏళ్ల కింద తన రాజకీయ ప్రస్థానం కూడా గుర్తు చేసుకుని.. దాన్ని కూడా గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ కోసం వాడుకుంటున్నాడు చిరంజీవి. నిజం చెప్పాలంటే 15 రోజుల క్రింది వరకు కూడా ఈ సినిమాపై అంచనాలు అంతగా లేవు. పైగా ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో.. బిజినెస్ కూడా ఊహించినంతగా జరగలేదు. అడ్వాన్స్ పద్ధతిలోనే సినిమాను కూడా అమ్మేశారు నిర్మాతలు. అయితే ట్రైలర్ విడుదలైన తర్వాత.. ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశాక పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి.
చిరంజీవి సినిమా అంటే ఇలా ఉండాలి అనేలా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు గాడ్ ఫాదర్ టీం. అక్టోబర్ 1 న ముంబైలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అక్కడ కూడా సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు చిరంజీవి. దీనికి సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి పొలిటికల్ డైలాగులపై బాగానే డిబేట్లు జరుగుతున్నాయి. తాను రాజకీయాల్లో లేకపోయినా తమ్ముడు ఉన్నాడు కాబట్టి అతడికి పనికొచ్చేలా ఈ సినిమాలో కొన్ని డైలాగులు మెగాస్టార్ రాయించాడని తెలుస్తుంది. అందులో భాగంగా వచ్చిందే ఎమ్మెల్యేలపై కాంట్రాక్టుల డైలాగ్ కూడా..! మొత్తానికి ఈ సినిమా కోసం చిరంజీవి వేసిన మెగా ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
Ponniyin Selvan-1 | పొన్నియన్ సెల్వన్-1 బుకింగ్స్ పరిస్థితి ఏంటి..?
BTS of Nayanathara | ‘గాడ్ ఫాదర్’ నుంచి నయనతార బీటీఎస్ వీడియో
Godfather Trailer | ‘నేనున్నంత వరకు ఈ కుర్చీకి చెదపట్టనివ్వను’..’గాడ్ ఫాదర్’ ట్రైలర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

