Tirumala | కలియుగదైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని (Lord Venkateswara Swamy) టాలీవుడ్ స్టార్ నటి మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న నటికి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. మీనాక్షి చౌదరి శ్రీవారిని దర్శించుకుని ఆలయం బయటకు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటిని చూసిన భక్తులు ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు.
Also Read..
Ram Gopal Varma | దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. ఫిర్యాదుచేసిన రిటైర్డ్ ఐపీఎస్
Bigg Boss Telugu 9 | పదో రోజు లవ్ ట్రాక్‌ల హంగామా, థ్రిల్‌గా సాగిన కెప్టెన్సీ టాస్క్
రెండు వేలకు మించి ఖర్చుపెట్టను!