Bigg Boss Telugu 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పదో రోజు ఎపిసోడ్ మొత్తం లవ్ ట్రాక్‌లతోనే సందడి చేసింది . గత సీజన్లలో కొన్ని ట్రాక్‌లు పెద్దగా వర్కౌట్ కాకపోయినా, ఈసారి మాత్రం బిగ్ బాస్ కంటెంట్ కోసం వాటిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు కనిపించింది. దాంతో పులిహోర వ్యవహారాల చుట్టూనే ఎపిసోడ్ మొత్తం సాగింది. చివర్లో కెప్టెన్సీ టాస్క్ హైలైట్‌గా నిలిచింది. మొదటి వారం నుంచే క్లోజ్‌గా ఉన్న రీతూ చౌదరీ, పవన్ కళ్యాణ్ లవ్ ట్రాక్ ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. రీతూ పులిహోర కలుపుతుంటే, పవన్ కూడా స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. ఆమెను “ఏంజెల్… చాలా క్యూట్‌గా ఉన్నావు” అని పొగడగా, రీతూ ఫిదా అయిపోయింది. ఇదంతా ఇమ్మాన్యుయెల్ సమక్షంలో జరగడం ప్రత్యేకం.
గార్డెన్ ఏరియాలో కూర్చొని ఇద్దరూ ప్రేమ ముచ్చట్లు చెప్పుకోవడం, “నేనే చాక్లెట్, నన్నే తినేయ్” అనే పవన్ మాటలు ఎపిసోడ్లో క్రేజీగా నిలిచాయి. ఇంకోవైపు తనూజ – ఇమ్మాన్యుయెల్ జంట కూడా హౌజ్‌కి ఎంటర్టైన్మెంట్ అందించింది. ఇద్దరూ లవర్స్‌లా నటిస్తూ ఫన్నీగా ఎంజాయ్ చేశారు. తనూజ అబ్బాయి, ఇమ్మాన్యుయెల్ అమ్మాయి పాత్రలు వేసుకుని సరదాగా మాట్లాడుకోవడం, ముద్దులు పెట్టుకోవడం ఆడియెన్స్‌కి కిక్ ఇచ్చింది. ఇక్కడితో ఆగకుండా తనూజ మరో ట్రాక్‌ను రహస్యంగా నడిపించింది. ఇమ్ముకి తెలియకుండా కళ్యాణ్‌తో క్లోజ్‌గా మూవ్ అయింది. ఇద్దరూ సీక్రెట్‌గా మాట్లాడుకోవడం, గుసగుసలు పెట్టుకోవడం హౌజ్లోకొంత డ్రామా క్రియేట్ చేసింది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎపిసోడ్లో మరింత మసాలా జోడించింది.
కెప్టెన్ సంజనా హౌజ్ రూల్స్‌లో మార్పులు చేసింది. సుమన్ శెట్టి బిగ్ బాంబ్‌తో హౌజ్ క్లీనింగ్ చేస్తుండగా, సంజనా ఆ పనిని ఇమ్మాన్యుయెల్‌కి అప్పగించి కుకింగ్ సెక్షన్‌కి మార్చింది. దీనిపై హరీష్ అభ్యంతరం తెలిపినా, కెమెరాకి ముందే ఆయన నిద్రపోతూ పట్టుబడటం టాస్క్‌లో కొత్త ట్విస్ట్ అయ్యింది. చివర్లో బిగ్ బాస్ “కాలమా? చక్రవ్యూహమా?” అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. హోనర్స్, టెనెంట్స్ మధ్య జరిగిన ఈ గేమ్ బాగా రసవత్తరంగా సాగింది. 12 గంటల టైమర్ ఉన్న టెనెంట్స్, 10 గంటల టైమర్ ఉన్న హోనర్స్తో పోటీ పడగా, ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న హోనర్స్ టీమ్ విన్నర్‌గా నిలిచింది. వారు కెప్టెన్సీ కంటెండర్స్ రేస్‌లోకి ఎంటర్ అయ్యారు. మొత్తంగా పదో రోజు ఎపిసోడ్ పూర్తిగా లవ్ ట్రాక్‌లతో పాటు టాస్క్ హంగామాతో ఎంటర్టైనింగ్గా సాగింది.