Meenakshi Chaudhary | హిట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మీనాక్షి చౌదరి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మహేశ్ బాబు, విజయ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఈ భామ నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ ది గోట్ (The Greatest Of All Time). కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజాగా ఈ చిత్రం నుంచి థర్డ్ సింగిల్ ప్రోమో అప్డేట్ లుక్‌ను విడుదల చేశారు. ఇవాళ సాయంత్రం 7 గంటలకు ప్రోమోను విడుదల చేయనున్నారు. ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ రేపు సాయంత్రం 6 గంటలకు లాంచ్ చేయనున్నారు. విజయ్, మీనాక్షి చౌదరి స్టైలిష్‌గా సాంగ్‌లో సందడి చేయబోతున్నట్టు లుక్‌తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.
దళపతి 68 (Thalapathy 68)గా వస్తోన్న ఈ మూవీ సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా ఐమ్యాక్స్ వెర్షన్లో కూడా రిలీజ్ కానుండగా..అభిమానుల కోసం ఇండియాలో కూడా ఐమ్యాక్స్ వెర్షన్ సందడి చేయనుంది.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ మూవీలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం, అరవింద్ ఆకాశ్, ప్రేమ్ గీ అమరేన్, వైభవ్, మనోబాల, వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Just 8 hours more to ignite you with #TheGoatThirdSingle promo 🔥
Promo from Today 7 PM 😁
Song From Tomorrow 6PM😉@actorvijay SirA @vp_offl Hero
A @thisisysr Magical #TheGreatestOfAllTime#ThalapathyIsTheGOAT#KalpathiSAghoram#KalpathiSGanesh#KalpathiSSuresh… pic.twitter.com/ULc3sIWEX2— venkat prabhu (@vp_offl) August 2, 2024
Buddy Review | అల్లు శిరీష్ కొత్త ప్రయత్నం వర్కవుట్ అయిందా.. బడ్డీ ఎలా ఉందంటే..?
Trisha | ఓటీటీలో త్రిష తెలుగు వెబ్ సిరీస్ బృంద.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే..?
Aamir Khan | క్రేజీ టాక్.. ఆ డైరెక్టర్‌నే నమ్ముకున్న అమీర్‌ఖాన్..!