NC24 | టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగ చైతన్య నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ NC24. విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మైథలాజికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్తను షేర్ చేశారు మేకర్స్. ప్రతీ యాత్ర ఒక రహస్యంతో ప్రారంభమవుతుందంటూ ఓ క్యాప్షన్ ఇచ్చారు. ఆమె గురించి రేపు ఉదయం 10 :08 గంటలకు చెప్పబోతున్నామంటూ డార్క్ షేడ్స్‌లో ఉన్న మీనాక్షి చౌదరి బ్యాక్ లుక్ షేర్ చేశారు.
ఇప్పుడీ లుక్ నెట్టింట వైరల్ అవుతూ మూవీపై క్యూరియాసిటీ పెంచుతోంది. లాపతా లేడీస్ ఫేం స్పర్శ్ శ్రీవాత్సవ NC24 కీలక పాత్రలో నటిస్తున్నాడు. లాపతా లేడీస్‌లో దీపక్ కుమార్ పాత్రలో మెరిసి తన యాక్టింగ్‌తో అందరినీ ఇంప్రెస్ చేశాడు రాజస్థానీ యాక్టర్ స్పర్శ్ శ్రీవాత్సవ. మరి ఈ చిత్రంలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడన్నది ఆసక్తి నెలకొంది.
ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎస్ ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. కాంతార ఫేం అజనీశ్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ సమకూరుస్తున్నాడు.
Every expedition begins with a mystery!
Tomorrow, she becomes one.
10:08 AM 🔎#NC24 ❤️🔥❤️🔥❤️🔥
Yuvasamrat @chay_akkineni @Meenakshiioffl @karthikdandu86 #SparshShrivastava @BvsnP @aryasukku #RagulDHerian @AJANEESHB @Srinagendra_Art @NavinNooli @SVCCofficial @SukumarWritings… pic.twitter.com/2uqURMKweZ
— BA Raju’s Team (@baraju_SuperHit) November 2, 2025