Mahesh Babu | విలక్షణ నటుడు రావు రమేశ్ (Rao Ramesh) లీడ్ రోల్లో నటించిన చిత్రం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం (Maruti Nagar Subramanyam). మారుతి నగర్లో ఫన్ మొదలైంది అంటూ. . ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమాపై మహేశ్ బాబు తన తన స్పందనను తెలియజేశాడు.
ఉల్లాసవంతమైన ప్రయాణం.. ఇటీవల కాలంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో ఉత్తమ చిత్రం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. తబిత సుకుమార్ అండ్ చిత్రయూనిట్‌కు అభినందనలు.. అని ట్వీట్ చేశాడు మహేశ్ బాబు. ఇప్పుడీ ట్వీట్ మూవీ లవర్స్‌లో సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ చిత్రానికి హ్యాపీ వెడ్డింగ్ ఫేం లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించగా.. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి లీడ్ రోల్స్‌లో నటించారు. ఇంద్రజ కీలక పాత్ర పోషించింది. బుజ్జి రాయుడు పెంట్యాలా, మోహన్ కార్య సంయుక్తంగా తెరకెక్కించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ విడుదల చేసింది. పీబీఆర్ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది.. ఈ బ్యానర్లో వచ్చిన రెండో చిత్రమిది.
What a hilarious ride! #MaruthiNagarSubramanyam is one of the best family entertainers in recent times… Congratulations @Thabithasukumar and the entire team! @lakshmankarya @kalyannayak_ofl @lokamaatre @AnkithKoyyaLive @RamyaPasupulet9 @mohankarya @sriudayagiri…
— Mahesh Babu (@urstrulyMahesh) August 31, 2024
SUPERSTAR @urstrulyMahesh Garu watched #MaruthiNagarSubramanyam & appreciates the team for delivering a hilarious blockbuster ❤🔥#SuperStarMahesh pic.twitter.com/JA6B4bK8LV
— BA Raju’s Team (@baraju_SuperHit) August 31, 2024
Nayan Sarika | సౌతిండియన్ను కాదని తెలిసి అల్లు అర్జున్ షాకయ్యారు.. ఆయ్ భామ నయన్ సారిక
Devara | తారక్-జాన్వీకపూర్ మాస్ డ్యుయెట్.. దేవర థర్డ్ సాంగ్ ఇదే
Kanguva | ఆ వార్తలే నిజమయ్యాయి.. కంగువ వాయిదాపై సూర్య క్లారిటీ