మారుతి దర్శకత్వంలో హ్యాపీ పొంగల్?
సంక్రాంతికి ‘ది రాజాసాబ్'తో ప్రేక్షకుల్ని పలకరించిన దర్శకుడు మారుతికి, ఆ సినిమా ఫలితం చేదు అనుభవాన్ని మిగిల్చింది. మరి నెక్ట్స్ ఆయన ఎవరితో సినిమా చేస్తారు? అనే విషయంపై కొన్ని రోజులుగా ఫిల్మ్‌వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి.
సంక్రాంతికి ‘ది రాజాసాబ్’తో ప్రేక్షకుల్ని పలకరించిన దర్శకుడు మారుతికి, ఆ సినిమా ఫలితం చేదు అనుభవాన్ని మిగిల్చింది. మరి నెక్ట్స్ ఆయన ఎవరితో సినిమా చేస్తారు? అనే విషయంపై కొన్ని రోజులుగా ఫిల్మ్‌వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం మారుతి ఓ కథను సిద్ధం చేసుకున్నారు. మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. వరుణ్‌తేజ్, సాయిదుర్గతేజ్, రామ్ ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు హీరో అయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపించింది. అయితే.. ఈ కథను చివరకు వైష్ణవ్‌తేజ్ ఓకే చేసినట్టు సమాచారం.
ప్రస్తుతం కథల విషయంలో వైష్ణవ్ ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇప్పటివరకూ ఎన్ని కథలు విన్నా ఆయన ధైర్యంగా ‘ఎస్’ చెప్పలేదు. కానీ మారుతీతో కలిసి నడవడానికి ఆయన సిద్ధమైనట్టు తెలిసింది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానున్నదని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని మారుతి భావిస్తున్నారు. ‘హ్యాపీ పొంగల్’ అనే టైటిల్‌ని కూడా రిజిస్టర్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

