Marokkasari | మత్తు వదలరా, గుర్రం పాపిరెడ్డి ఫేం నరేశ్ అగస్త్య్ర (Naresh Agastya) హీరోగా నటిస్తోన్న చిత్రం మరొక్కసారి. సంజనా సారథి హీరోయిన్గా నటిస్తోంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా వస్తోన్న ఈ మూవీకి నితిన్ లింగుట్ల రైటర్ కమ్ డైరెక్టర్. తెలుగుతోపాటు దక్షిణాది భాషల్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కాగా ఈ మూవీ షూటింగ్ టైంలోనే టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
మరొక్కసారి షూటింగ్ కేరళలోని అందమైన ప్రదేశాలతోపాటు సిక్కిం సమీపంలోని టిబెట్ సరిహద్దులో జరిగింది. అంతేకాదు సముద్ర మట్టానికి సుమారు 5,403 మీటర్ల ఎత్తులో (17,800 అడుగుల) ఎత్తుల్లో ఉండే గురుడోంగ్మర్ లేక్ (Gurudongmar lake) దగ్గర షూటింగ్ జరుపడం విశేషం. ఇంత భారీ ఎత్తులో క్లిష్ట పరిస్థితుల్లో షూటింగ్ జరుపుకున్న తొలి ఇండియన్ సినిమాగా మరొక్కసారి అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది.
ఆర్మీ బలగాల అనుమతి తీసుకుని ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉండటం, విపరీతమైన చలి, అంచనా వేయలేని వాతావరణం లాంటి సవాళ్లను అధిగమించి షూటింగ్ చేసి సినిమా పట్ల తమకున్న డెడికేషన్ ఎలాంటిదో చెబుతున్నారు మేకర్స్. కథలోని భావోద్వేగాలను, రియాలిటీని ప్రేక్షకులు ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి షూటింగ్ చేశామని నిర్మాత చంద్రకాంత్ రెడ్డి తెలిపారు. విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
Chiru 158 | చిరంజీవి–బాబీ కొల్లి కాంబోపై అంచనాలు .. కృతి శెట్టి పాత్రపై తొలగిన అనుమానాలు