Mareesan Teaser | తమిళ హాస్యనటుడు వడివేలు(Vadivelu), మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాసిల్(Fahadh Faasil) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మారీసన్(Mareesan). ట్రావెల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాకు సుధీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ ఆర్.బి. చౌదరి నిర్మిస్తున్నాడు. కోవై సరళ, వివేక్ ప్రసన్న, సితార, పిఎల్ తేనప్పన్, లివింగ్స్టన్, రేణుక, శరవణ సుబ్బయ్య, కృష్ణ, హరిత, టెలిఫోన్ రాజా తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ టీజర్‌ని 1957లో వచ్చిన క్లాసిక్ చిత్రం ‘మాయాబజార్’లోని ఆహా ఇన్బ నిలావినిలే(లాహిరి లాహిరి లాహిరిలో) అనే పాటతో కట్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తుంటే.. వడివేలు, ఫహాద్ ఫాసిల్ అనుకోకుండా బైక్‌పై ప్రయాణం చేస్తూ ఆ ప్రయాణంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది.
‘మామన్నన్’ చిత్రం తర్వాత ఈ ఇద్దరు నటులు కలిసి నటిస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకోగా, తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
Read More