Manjummel Boys | మాలీవుడ్ నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించిన మూవీ ‘మంజుమ్మెల్ బాయ్స్’ (Manjummel Boys). సర్వైవర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 22న విడుదలైన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపింది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఇప్పటికే మలయాళం, తెలుగు, తమిళం హిందీ, కన్నడ భాషల్లో సక్స్‌స్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది.
కాగా థియేటర్లు, ఓటీటీలో సూపర్ ఇంప్రెషన్ కొట్టేసిన ఈ చిత్రం ఇక టీవీలో కూడా తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం మంజుమ్మెల్ బాయ్స్ తెలుగు ప్రేక్షకుల కోసం సెప్టెంబర్ 22న సాయంత్రం 6:30 గంటలకు స్టార్ మాలో టెలివిజన్ ప్రీమియర్ కానుంది. ఇంకేంటి మరి సినిమాపై మీరూ లుక్కేయండి.
ఈ చిత్రంలో శోభున్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గేస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, దీపక్, అరుణ్ ఇంకా అభిరాంతోపాలు పలువురు లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ చిత్రం టీవీలో ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
World Television Premiere
A True Story Of Friendship And Courage#ManjummelBoys
Sunday At 6.30pm On #StarMaa pic.twitter.com/2wx9wHWrEP— Telugu Television News (@TeluguTvExpress) September 16, 2024
VidaaMuyarchi | డైలామాకు చెక్.. అజిత్ కుమార్ విదాముయార్చి రిలీజ్ ఎప్పుడో చెప్పిన అర్జున్
Vettaiyan | రజినీకాంత్ వెట్టైయాన్ ఆడియో లాంచ్ డేట్, ప్లేస్‌పై మేకర్స్ క్లారిటీ
Mathu Vadalara 3 | త్రిబుల్ ఎంటర్టైన్ మెంట్.. మత్తు వదలరా 3 కూడా వచ్చేస్తుంది